జయకు నో, కరుణ కోసం వెనక్కి: మెరినా బీచ్‌లో అంత్యక్రియలపై ఏం జరిగిందంటే?
Recommended Video

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల విషయంలో తమిళనాడు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని, మెరీనా బీచ్ పక్కనే ఆయనకు స్థలం ఇవ్వాలని డీఎంకే ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ జయలలిత మృతి సమయంలోనే ఈ రాజకీయం చోటు చేసుకుంది. అప్పుడు జయకు వ్యతిరేకింగా వేసిన పిటిషన్‌నే ఇప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.

నా పిల్ చూపించి ప్రభుత్వం
నాడు, మెరీనా బీచ్‌లో జయలలిత మెమోరియల్‌కు వ్యతిరేకంగా పిల్ వేసిన దురైసామి ఇప్పుడు హఠాత్తుగా కరుణానిధి కోసం ఉపసంహరించుకున్నారు. అదే పిల్‌ను చూపించి ప్రభుత్వం నో చెప్పగా, దురైసామి ఆగమేఘాల మీద జయ మెమోరియల్‌కు వ్యతిరేకంగా వేసిన పిల్‌ను ఇన్నాళ్లకు.. మంగళవారం రాత్రి ఉపసంహరంచుకున్నారు. కరుణకు రూట్ క్లియర్ చేసేందుకు వెనక్కి తగ్గారు.

నిన్న జయకు వద్దని పిటిషన్, నేడు కరుణకు కావాలంటూ ఉపసంహరణ
కరుణానిధికి మెరినా బీచ్‌లో స్థలం కావాలంటూ డీఎంకే వేసిన పిటిషన్‌ను మంగళవారం అర్థరాత్రి దాటాక జస్టిస్ రమేశ్, జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. మెరీనా బీచ్‌లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు జరపరాదంటూ హైకోర్టులో గతంలో పిటిషన్ వేసిన ఎం దురైస్వామి హుటాహుటిన జస్టిస్ రమేశ్ నివాసానికి చేరుకున్నారు. తన పిటిషన్‌ను ఉపయోగించుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, అందువల్ల ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరై తన కేసును ఉపసంహరించుకుంటున్నట్లు చెబుతున్నానని, కరుణానిధికి అన్నాదురై సమాధి పక్కనే అంత్యక్రియలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వేసిన పిటిషన్‌నే అన్నాడీఎంకే ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగించుకుంది. నాడు జయలలిత మెమోరియల్ విషయంలోను వారు రాజకీయం చేశారు. ఇప్పుడు అదే పిటిషన్‌ను పళనిస్వామి ప్రభుత్వం ఓ ఆయుధంగా ఉపయోగించుకుంది.

ఆ పిటిషన్ వల్లే సొంతవాడు వేసిన పిటిషన్ వల్లే
అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధికి చోటు కల్పించాలని కోరారు. డీఎంకే, విపక్షాలు ప్రతి అంశంలోకి ఆరెస్సెస్, బీజేపీలను లాగుతాయనే విషయం తెలిసిందే. ఇందులోకి కూడా లాగింది. మెరినా బీచ్‌లో ఇవ్వకపోవడం వెనుక ఆరెస్సెస్ ఉన్నట్లుగా కనిపిస్తోందని, బీజేపీ విషయం ఇప్పుడు తేలిపోయిందని డీఎంకే లాయర్ శరవణన్ ట్వీట్ చేశారు. అయితే, జయకు వ్యతిరేకంగా నాడు దురైసామి పిటిషన్ వేసి, ఇప్పుడు కరుణ కోసం తగ్గడంపై డీఎంకే స్పందించడం లేదు.

అర్ధరాత్రి వాదనలు
కరుణకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియల విషయమై మంగళవారం అర్ధరాత్రి వాదనలు సాగాయి. ఆ తర్వాత డిఎంకే పిటిషన్ పైన సిద్ధం కాలేదని, తమకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు లాయర్ అడిగారు. దీంతో న్యాయస్థానం బుధవారం ఉదయం 8 గంటల వరకు సమయం ఇచ్చింది. కరుణకు మెరినా బీచ్‌లో ఎందుకు చోటివ్వకూడదో చెప్పాలని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు లాయర్లు లీగల్ అంశాలను ప్రస్తావించకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారని, మెరీనా బీచ్‌లో కరుణానిధికి ఆరు అడుగుల స్థలం కోసం రాజకీయం చేస్తున్్నారని డీఎంకే లాయర్ శరవణన్ అన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications