సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆ ఫైలులో, 100 ఏళ్ల వరకు చెప్పరు
న్యూఢిల్లీ: సుభాష్ చంద్రబోస్ ఎక్కడ, ఎలా మరణించారనే అంశంపై పలు వాదనలు ఉన్నాయి. ఆయన చివరి రోజుల్లో ఎలా గడిపారు, ఏమయ్యారనే కీలక సమాచారం ఫైలు ఫ్రాన్సులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ చరిత్రకారుడు మోర్ ఆ సమాచారం కోరారు.
కానీ ఆ వివరాలు వెల్లడించేందుకు ఫ్రెంచ్ నేషనల్ ఆర్కైవల్ అథారిటీ అంగీకరించలేదు. వందేళ్ల వరకూ ఆ ఫైల్‌ను బహిర్గతం చేయరాదని అధికారులు నిర్ణయించినట్లు మోర్ తెలిపారు.

అందరూ భావిస్తున్నట్లు తైపే విమాన ప్రమాదంలో బోస్ మరణించి ఉండకపోవచ్చునని, నిజంగా బోస్ అక్కడే మరణించినట్లయితే టోక్యోలో ఉంచిన బూడిదకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తే వాస్తవమేంటో తెలిసిపోతుందని ఆయన తెలిపారు. కానీ, డీఎన్‌ఏ పరీక్ష చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లు పరిశోధించిన తాను, ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ రికార్డుల ఆధారంగా వియన్నాలోని సైగన్ ప్రాంతంలోని జైలులో బోస్ మరణించినట్లు నిర్ధారించే స్థాయికి వచ్చినట్లు చెప్పారు.
ఇండియన్ నేషనల్ ఆర్మీ, సైగన్‌లో బోస్ గడిపిన కాలాన్ని తెలిపే వివరాలున్న ఫైల్‌ను అడిగితే ఫ్రెంచ్ అధికారులు ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications