ఇష్టం లేకున్నా సెక్స్: నిర్మాత మేనల్లుడిపై భార్య ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

ముంబై: తనకు ఇష్టం లేకున్నా తనను శరీరకంగా బలవంతంగా వాడుకుంటున్నాడని ఓ మహిళ తన భర్తపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ విచిత్రమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. అయితే, ఆమె ఫిర్యాదు చేసింది ఓ బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై కావడం గమనార్హం.

ఆ మహిళ ఫిర్యాదు మేరకు వెర్సోవా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన భర్త తన నగలన్నీ తీసుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నగలు తనకిచ్చేందుకు నిరాకరిస్తున్నాడని చెప్పింది.

Film producer’s nephew booked for raping wife

అంతేగాకుండా తన ఇష్టం లేకపోయినప్పటికీ తనతో బలవంతంగా శృుంగారం చేస్తున్నాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 376(రేప్), 498(ఏ)(భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, సదరు నిందితుడు తన మామ నిర్మాత కావడంతో అతనికి సంబంధించిన ప్రొడక్షన్ హౌజ్ బాధ్యతలు చూసుకునేవాడని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The nephew of a film producer was booked after his wife approached the police recently and accused him of harassment and rape.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి