బీజేపీ మార్క్: సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా పహ్లాజ్, సభ్యురాలిగా జీవిత
న్యూఢిల్లీ: సెన్సార్ బోర్డు కొత్త చైర్ పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీని, తొమ్మిది మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్న లీలా శ్యాంసన్, సభ్యులు గతవారం రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్ పర్సన్‌ను, సభ్యులను నియమించింది.
పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్‌లో నిర్మాతగా సుపరిచితులు. కాగా, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటి జీవితను కూడా సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించారు.

సెన్సార్ బోర్డు సభ్యులుగా జీవితతో పాటు ఎస్ శేఖర్, అశోక్ పండిత్, సయ్యద్ బరీ, మిహిర్ భూటా, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, రమేష్ పతంగె, జార్జ్ బేకర్‌లు ఉన్నారు.
ది మెసెంజర్ ఆప్ గాడ్ సినిమాకు అప్పీలెట్ ట్రైబ్యునల్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శ్యాంసన్, తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేశారు. కాగా, పహ్లాజ్ నిహలానీ ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహలానీ సోదరుడు. భారతీయ జనతా పార్టీ ఎంపీ శత్రఘ్ను సిన్హాకు బావమరిది.
కాగా, జీవిత తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. అనంతరం నిర్మాతగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. రాజశేఖర్, జీవిత దంపతులు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో పని చేశారు. వైయస్ మృతి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జీవిత బీజేపీలో చేరారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications