జాతీయ పౌర రిజిస్టర్ తుదిజాబితా రిలీజ్ : 19 లక్షల మందికి దక్కని చోటు

గువహతి : జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 3 కోట్ల 11 లక్షల 21 వేల 4 మంది జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నారు. 19 లక్షల 6 వేల 657 మంది పేర్లు తుది జాబితాలో లేవని వెల్లడించారు. తాము కోరిన ధ్రువపత్రాలను సమర్పించలేనందున .. వారిని ఫైనల్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు ఎన్‌ఆర్సీ వర్గాలు ప్రటకించాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ పౌరసత్వ రిజిస్టర్ జాబితాలో లేని పేర్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇందులో 19.06 లక్షల మందిని విదేశీయులని తేల్చారు. దీంతో అసోంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుందనే ఊహగానాలతో అక్కడ భారీగా భద్రతా బలగాలను మొహరించారు. గువహతిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

Final National Register of Citizens released, 19 lakh people fail the test

జాబితాలో ేలని వారి కోసం కేంద్ర ఉపశమన చర్యలు చేపట్టింది. జాబితాలో లేకపోయినా ... ఎవరినీ వెంటనే విదేశీయులుగా పరిగణించిబోమని ప్రకటించింది. విదేశీయుల గుర్తింపుపై ట్రైబ్యునల్‌లో తీర్పు వచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టంచేసింది. అలాగే ఎవరినీ నిర్బంధించబోమని కూడా హామీనిచ్చింది. అయితే వారికి ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ఇతర సౌకర్యాల నుంచి మాత్రం మినహాయింపు ఉండదని తేల్చిచెప్పింది. అయితే వారి పిల్లలకు విద్య, పౌరసత్వం ఇతర అంశాల్లో ఆటంకాలు ఉండవని పేర్కొన్నది. జాబితాలో లేనివారు ట్రైబ్యునల్, తరవాత దశలో హైకోర్టులో అప్పీల్ చేసుకుని .. న్యాయం పొందడానికి అవసరమయ్యే వ్యయాన్ని భరిస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+