7 శాతం వృద్ధితో ముందుకు సాగుతున్నాం: Nirmala Sitharaman

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) లోక్ సభలో తన 9వ బడ్జెట్(BUDGET 2026) ను ప్రవేశ పెట్టారు. కేంద్ర బడ్జెట్‌ను వివరిస్తూ, భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా, సమర్థవంతంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. దేశ ఆర్థిక గమనం మితమైన ద్రవ్యోల్బణం, ఫిస్కల్ ప్రూడెన్స్, నిరంతర వృద్ధి, ప్రజా పెట్టుబడిపై ధృఢ దృష్టితో సాగిందని. ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో సంస్కరణలను" ప్రాధాన్యం ఇచ్చారని, విస్తృతమైన నిర్మాణాత్మక సంస్కరణలు దేశానికి మాక్రో-స్థిరత్వం కలిగించడంలో కీలకంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.

కొత్త సాంకేతికతలు ఉత్పత్తిని పెంచుతున్నప్పటికీ, నీరు, ఇంధనంపై డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయని నిర్మలమ్మ చెప్పారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం దేశీయ తయారీ సామర్థ్యాన్ని బలపరచి, ఇంధన భద్రతను సాధించింది. ప్రధాన నిర్ణయాల ద్వారా, భారత్ సుమారుగా 7% వృద్ధి రేటుతో ముందుకు సాగుతుందని ఆమె పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా "వికసిత భారత్" దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.

Finance Minister Nirmala Sitharaman Unveils Youth Power Budget 2026 Focused on Growth Reforms and Inclusive Development

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను "యువశక్తి ఆధారిత" బడ్జెట్‌గా నిర్వచిస్తూ, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ ఆధారిత బడ్జెట్‌ ఇది అని వెల్లడించారు. మూడు కర్తవ్యాలను (kartavya) ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి నిలబెట్టడం, ప్రజల ఆశయాలను సాకారం చేయడం, ప్రతి కుటుంబం, కమ్యూనిటీ మరియు ప్రాంతానికి అందించడం లక్ష్యమన్నారు.

కర్తవ్యాలే లక్ష్యం..

3 కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించిన నిర్మలా సీతారామన్.. కర్తవ్యం-1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి, కర్తవ్యం- 2: వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, కర్తవ్యం- 3: 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రమన్నారు. జనవరిలో జీఎస్టీ కలెక్షన్లు రూ. 1.93 లక్షల కోట్లు సాధించగా.. ఎకానమీలో నిలకడ వచ్చిందని తెలిపారు. ద్రవ్యోల్బణం మోడరేట్‌గా ఉందిని స్పష్టం చేశారు నిర్మలా సీతారామన్‌.

"నిర్మాణాత్మక సంస్కరణల వేగాన్ని కొనసాగించడం ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరం. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ దృష్టితో, సదా అనుకూలంగా, 350కుపైగా సంస్కరణలను అమలు చేసింది. కటింగ్-ఎడ్జ్ సాంకేతికతలు, AI వంటి టూల్స్ వృద్ధికి మల్టిప్లయర్‌లుగా ఉపయోగపడతాయి. ఈ సంస్కరణల ద్వారా ఉపాధి సృష్టి, ఉత్పాదకత పెంపు, దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఉంది" నిర్మలా సీతారామన్.

ఈ బడ్జెట్ ద్వారా దేశ యువ శక్తిని ప్రధానంగా దృష్టిలో పెట్టి, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తూ, కొత్త సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని నిర్మలా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+