వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Leader: టాప్ లీడర్ కు షాక్, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడి మీద చీటింగ్ కేసు, ఆ రోజు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ మంత్రి, టాప్ లీడర్ చిక్కుల్లో పడ్డారు. స్థలం ఇప్పిస్తామని ఓ సంస్థను మోసం చేశారని మాజీ మంత్రి చీటింగ్ కేసు నమోదు అయ్యింది. గతంలో సీఎం తరువాత టాప్ త్రీ మంత్రుల్లో ఒక్కడిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి ప్రస్తుతం ఆయన పార్టీ అధికారంలో ఉన్న ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి మీద చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆయన వర్గీయులు హడలిపోయారు. ప్రభావంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి మొదట పోలీసులు కేసు నమోదు చెయ్యడానికి వెనకడుగు వేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి మీద చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఉలిక్కిపడ్డారు.

Illegal affair: ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్, బర్త్ డే పార్టీలో నేరుజారి ?, కట్ చేసి రోడ్డు మీద !Illegal affair: ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్, బర్త్ డే పార్టీలో నేరుజారి ?, కట్ చేసి రోడ్డు మీద !

చక్రం తప్పిన కట్టా సుబ్రమణ్యం నాయుడు

చక్రం తప్పిన కట్టా సుబ్రమణ్యం నాయుడు

కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడి పేరు ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కర్ణాటక రాజకీయాలు తెలిసినవారికి కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తరువాత బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో కట్టా సుబ్రమణ్యం నాయుడు కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు.

టాప్ త్రీ మంత్రుల్లో ఒక్కడు

టాప్ త్రీ మంత్రుల్లో ఒక్కడు

యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టా సుబ్రమణ్యం నాయకుడు టాప్ త్రీ మంత్రుల్లో ఒక్కడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రవాస ఆంధ్రుడైన కట్టా సుబ్రమణ్యం నాయుడు బెంగళూరులోని శివాజీనగర నియోజక వర్గంలో మూడుసార్లు, హెబ్బాళ నియోజక వర్గం నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 రూ. 2. 85 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు

రూ. 2. 85 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు


2004లో కట్టా సుబ్రమణ్యం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇండ్ సిండ్ కంపెనీకి భూమి, ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి రూ. 2.85 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇండ్ సిండ్ కంపెనీ నుంచి చెక్ రూపంలో ఆ డబ్బు కట్టా సుబ్రమణ్యం నాయుడు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత స్థలంతో పాటు ఫ్లాట్ కూడా ఇవ్వలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఇండ్ సిండ్ కంపెనీ నిర్వహకులు ఆరోపిస్తున్నారు.

కోర్టును ఆశ్రయించిన బాధితులు

కోర్టును ఆశ్రయించిన బాధితులు


తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా కట్టా సుబ్రమణ్యం నాయుడు స్పందించడం లేదని, ఆయన మీద చీటింగ్ కేసు నమోదు చెయ్యాలని ఇండ్ సిండ్ కంపెనీ నిర్వహకులు హైగ్రౌండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే మీద కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు ధైర్యం చెయ్యలేదని సమాచారం.

Recommended Video

ఇందిరా పార్క్ లో మౌనదీక్షతో గర్జించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ!!
కట్టా మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

కట్టా మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు


బాధితులు బెంగళూరు ఎసీఎంఎం కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్ పోలీసులు మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు మీద చీటింగ్ కేసు నమోదు కావడంతో ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఉలిక్కిపడ్డారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో సీఎం తరువాత టాప్ త్రీ మంత్రుల్లో ఒక్కడిగా చక్రం తిప్పిన మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని బీజేపీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు.

English summary
Leader: FIR registered against BJP leader and Karnataka former Minister Katta Subramanyam Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X