Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు...13 మంది మృతి..
మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు ట్రక్కు ఢీ కొని, ఓ ప్రైవేటు బస్సులో తీవ్ర మంటలు చెలరేగాయి. దాంతో 13 మంది అగ్నికి అహుతయ్యారు. బుధవారం అర్థరాత్రి సమయంలో మధ్యప్రదేశ్‌లోని గుణ పట్టణంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గుణ-ఆరోన్ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మొత్తం 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అర్థరాత్రి సమయంలో ఈ ఘోరం సంభవించినట్లు తెలుస్తోంది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో బస్సులో నిద్రిస్తున్న 13 మంది ప్రయాణికులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరో 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్పందించిన సీఎం...
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో 17 మంది చికిత్స పొందుతున్నారని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు ఆయన వివరించారు. ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలు, వారిని గుర్తించే పనిలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైందని కలెక్టర్ తెలిపారు. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, వాటిని గుర్తుపట్టేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు చెప్పారు.
ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఓ పోలీస్ అధికారి వివరించారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, మరో 13 మంది ప్రాణాలు విడిచారు. 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు ఆయన తెలిపారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ పై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. మృతుల కుటుంబాల వారికి ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పును ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పును ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఈ ప్రమాదంపై ఇంకా విచారణ జరపాలని ఆధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications