ఆస్పత్రిలో మంటలు.. చిన్నారుల వార్డులో హాహాకారాలు.. కొనసాగుతోన్న సహాయక చర్యలు
మధ్యప్రదేశ్‌లో గల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. భోపాల్ కమల నెహ్రూ దవాఖానలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ గల చిన్నారుల వార్డులో మంటలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ వార్డులో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు రావడానికి గల కారణం తెలియరాలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recommended Video
ప్రమాదంలో కొందరు చిన్నారులు గాయపడ్డారని తెలుస్తోంది. మంటలు చెలరేగాక వార్డు నుంచి వచ్చే సమయంలో మెట్ల నుంచి పేరంట్స్ పడిపోతూ కనిపించారు. ఆ విజువల్స్ హృదయ విదారకరంగా ఉన్నాయి. ఘటన దిగ్బ్రాంతికి గురిచేసిందని సీఎం శివరాజ్ సింగ్ అన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విపత్తు నిర్వహణ చర్యలు తీసుకుంటామని.. అధికారులు ఎప్పుడూ తనతో టచ్‌లో ఉంటారని వివరించారు. పిల్లలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని.. వారికి ఏం కాదు అని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications