కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం: ఎగిసిన మంటలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చెక్ ఇన్ వద్ద సెక్యూరిటీ ఉండే ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అక్కడున్న ప్రయాణికులను ఖాళీ చేయించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కొంత సామాగ్రి కాలిబూడిదైనట్లు తెలిసింది. విమానాశ్రయం లోపల మంటలు చెలరేగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రిపబ్లిక్ బంగ్లా ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు, అక్కడ అన్ని విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. విమానాశ్రయంలోని వివిధ ప్రాంతాల్లో పొగలు వ్యాపించాయని నివేదికలు సూచిస్తున్నాయి.
కోల్ కత్తా విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం..చెక్ ఇన్ ఏరియాలో చెలరేగిన మంటలు..!!#KolkataAirport #Kolkata #Oneindiatelugu pic.twitter.com/VkjQUlIFoT
— oneindiatelugu (@oneindiatelugu) June 14, 2023
అయితే మంటలు పూర్తిగా ఆరిపోయాయని, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తరలించామని కోల్‌కతా విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
'చెక్ ఇన్ ఏరియా పోర్టల్ డీలో మధ్యాహ్నం చిన్న మంటలు, పొగ వచ్చింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. చెక్ ఇన్ ప్రాంతంలో పొగ ఉన్నందున చెక్ ఇన్ ప్రాసెస్ సస్పెండ్ చేయబడింది. చెక్ ఇన్, రాత్రి 10.15 గంటలకు ఆపరేషన్ పునఃప్రారంభిస్తున్నాం' అని కోల్‌కతా విమానాశ్రయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ తెలిపింది.












Click it and Unblock the Notifications