ముంబైలో భారీ అగ్ని ప్రమాదం: 14వ అంతస్తులో ఎగిసిన మంటలు
ముంబై: మహారాష్ట్రలోని నేవీ ముంబై వశి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రియల్ టెక్ పార్క్ భవనంలోని 14వ అంతస్తులో భారీ మంటలు, పెద్ద ఎత్తున పొంగలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనేది తెలియరాలేదు.












Click it and Unblock the Notifications