పాకిస్థాన్ కు బిగ్ షాక్.. పేలిన పాకిస్థాన్ యుద్ధ విమానం

పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్థాన్ లో కీలక పరిణామం చోటుకుంది. లాహోర్ లోని ఎయిర్ పోర్టులో పాకిస్థాన్ ఆర్మీ విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన సెకన్లలోనే ఆర్మీ విమానం టైర్లో మంటలు చేలరేగి పేలుడు సంభవించింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

పాకిస్థాన్ విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పి వేశారు. దీంతో లాహోర్ ఎయిర్ పోర్టుకు విమానాలను రద్దు చేశారు. రన్ వే మొత్తం దగ్ధమైనట్లు సమాచారం. దీంతో రన్ వేను పూర్తిగా మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఊపిరాడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Fire Breaks Out on Pakistan Army Plane at Lahore Airport

పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకున్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లేగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడితో కఠినమైన నిర్ణయాలు తీసుకుంది భారత్. ఇప్పటికే భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా భారత్, పాకిస్థాన్ ల మధ్య ఈ ఒప్పందం ఏర్పడింది.సింధూ నదీ జలాలు ఈ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు పంచుకుంటాయి. అయితే తాజాగా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అంతేకాక పాకిస్థాన్ పై చర్యల్లో భాగంగా పంజాబ్‌లోని అటారీ- వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లో శాంతి నెలకొల్పేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాకిస్థానీ ప్రజలకు వీసాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక పాకిస్థాన్ ప్రజలకు వీసాలు జారీ చేసేది లేదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+