గగుర్పొడిచేలా: గాల్వన్ వ్యాలీ రణక్షేత్రం ఇదే: గ్రౌండ్ జీరో శాటిలైట్ ఫొటోలు: 65 మంది..
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో భారత్ చైనా సరిహద్దుల్లో గల గాల్వన్ వ్యాలీలో రెండు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి ప్రాణాంతక దాడులు చోటు చేసుకున్న ప్రదేశానికి సంబంధించిన తొలి విజువల్స్ విడుదలను ప్రముఖ ఆంగ్ల దినపత్రి వెబ్‌సైట్ ఇండియాటుడే ప్రచురించింది. రెండు దేశాలకు చెందిన 65 మంది సైనికులు ఈ పరస్పర దాడుల్లో మరణించారు. 20 మంది భారత జవాన్లు అమరులు అయ్యారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) తరఫున 45 మంది సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. మృతుల సంఖ్యపై స్పష్టత కొరవడింది.

ప్లానెట్ ల్యాబ్స్ నుంచి
గాల్వన్ వ్యాలీకి సంబంధించిన కొన్ని ఖచ్చితమైన ఫొటోలను ఇండియాటుడే వెబ్‌సైట్ ప్రచురించింది. వాటిని ప్లానెట్ ల్యాబ్స్ నుంచి సేకరించినట్లు పేర్కొంది. సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోగా.. సరిగ్గా 24 గంటల తరువాత ఈ శాటిలైట్ ఫొటోలను చిత్రీకరించినట్లుగా చెబుతున్నారు. ఈ ఫొటోలు గగుర్పాటు కలిగించేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా చైనా సైన్యం ఇంత భారీ ఎత్తున సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిన సందర్భాలు లేవని అంటున్నారు.

పర్వత పంక్తుల మధ్య
గాల్వన్ నది పరీవాహక ప్రాంతంలో.. భారత్, చైనా దేశాలకు దారి తీసే రోడ్డు మార్గం సహా అక్కడ ఏర్పాటు చేసిన చైనా సైనికుల శిబిరాలు ఈ ఫొట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ హైరిజల్యూషన్ ఫొటోల్లో పలు కీలకమైన స్థావరాలు ఉన్నట్లు పేర్కొంది. భారత్ చైనా సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఎత్తయిన పర్వత పంక్తుల మధ్య సన్ననిపాయగా పారుతోన్న గాల్వన్ నది స్పష్టంగా కనిపిస్తోంది.దానికి ఆనుకుని ఉన్న మట్టి రోడ్డు మీద వెలిసిన సైనిక శిబిరాలు, కొన్ని వాహనాలు ఉన్నాయి.

వ్యూహాత్మక భూభాగంలా..
అవన్నీ చైనా ఆర్మీ పీఎల్ఏకు చెందినవగా అనుమానిస్తున్నారు. వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలో ఉండే ప్రదేశమని, రెండుదేశాల మధ్య రక్షణపరంగా అత్యంత వ్యూహాత్మక, అంతే సున్నితమైన ప్రదేశాలుగా ఈ ప్రాంతాన్ని భావిస్తున్నారు. ఇక్కడే- భారత భూభాగంలోనికి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ సైన్యాన్ని భారత జవాన్లు నిలువరించారని, ఫలితంగా దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో రెండు వైపుల నుంచి 65 మంది జవాన్లు మరణించారు.
Recommended Video

200లకు పైగా సైనిక వాహనాలు, శిబిరాలు..
గాల్వన్ నదీ పరీవాహక ప్రాంతం వెంట గ్రౌండ్ జీరో వరకూ చైనా సైనికులు శిబిరాలను నెలకొల్పారు. వందల సంఖ్య వాహనాలను మోహరింపజేశారు. ఇండియాటుడే ప్రచురించిన ఈ శాటిలైట్ ఫొటోల్లో కనీసం 200లకు వరకు సైనిక వాహనాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తోంటే.. చైనా పీఎల్ఏ సైనిక బలగాలు వెనక్కి తగ్గినట్టే తగ్గి.. దొంగదెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఇదివరకు ఎప్పుడూ గాల్వన్ లోయ ప్రాంతంలో ఈ స్థాయిలో చైనా సైనిక శిబిరాలు గానీ, మిలటరీ వాహనాలు గానీ కనిపించలేదని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications