Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ...

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుచేసి .. విభజించాక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న తరుణంలో ముష్కరులు రెచ్చిపోయారు. ఈ నెల 5న కశ్మీర్ విభజన జరగగా .. 22 రోజులకు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు. పౌరులను హతమార్చింది ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని మట్టుబెట్టింది ఎవరనే అంశం దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.

కశ్మీర్ విభజన తర్వాత ఉగ్ర మూకలు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లా ట్రాల్‌కు చెందిన మంజూర్ అహ్మద్, మహద్ ఖదీర్ అనే ఇద్దరిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. వాస్తవానికి వారిద్దరూ ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు యువకుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఇంతలో గురువారం వారిద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి హత్యకు సంబంధించి వివరాలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు

First incident of terror after Kashmir lockdown, militants kill 2 in Tral

కశ్మీర్ విభజన జరిగిన తర్వాత తొలిసారి ఉగ్ర మూకలు రెచ్చిపోయారు. ఇద్దరు పౌరులపై దాడిచేసి హతమార్చారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీగా బలగాలను మొహరించిన సంగతి తెలిసిందే. 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది కశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంత పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కూడా ఉగ్రవాదుల దాడులు ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ నెల 20న బారాముల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కాల్పుల్లో లష్కరే తోయిడా ఉగ్రవాది చనిపోగా, ఓ స్పెషల్ పోలీసు అధికారి వీరమరణం పొందారు. ఓ పోలీసు ఎస్సై గాయాలతో చికిత్స పొందుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+