Cervavac: సీరమ్ వ్యాక్సిన్‌తో కేన్సర్‌కు చెక్ - మహిళలకు ఆ ముప్పు తప్పినట్టే

ముంబై: ప్రాణాంతక కేన్సర్ కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను వినియోగంలోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గురువారం లాంఛనంగా ప్రారంభించనుంది. కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్ కే అరోరాతో కలిసి దీన్ని ప్రారంభించనున్నారు.

సర్వైకల్ కేన్సర్‌ను నయం చేయడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్- క్వాడ్రివలెంట్ హ్యూమన్ పపిల్లోమావైరస్ (క్యూహెచ్‌పీవీ). దీనికి సెర్వావ్యాక్ (Cervavac) అని పేరు పెట్టింది సీరమ్ యాజమాన్యం. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో మహిళలు సర్వైకల్ కేన్సర్ బారిన పడుతుంటారు. భారత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 2019 నుంచి ఇప్పటివరకు సర్వైకల్ కేన్సర్ వల్ల 41 లక్షలమందికి పైగా మహిళలు మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఈ ముప్పును నివారించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సర్వైకల్ కేన్సర్ బారిన పడ్డ పేషెంట్లపై ఇదివరకే ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన డేటాను కిందటి నెల 8 తేదీన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి సమర్పించింది. క్యూహెచ్‌పీవీపై వ్యాక్సిన్ యాంటీ బాడీస్ రెస్పాన్స్ ఎలా ఉందనే విషయాన్ని ఇందులో పొందుపరిచింది. పేషెంట్స్ వయస్సు, వారికి ఇవ్వాల్సిన డోసుల.. ఇతరత్రా పూర్తి వివరాలతో కూడిన క్లినకల్ డేటా ప్రతిపాదనలను డీజీసీఐకి అందజేసింది.

 First indigenously vaccine developed by India, against cervical cancer to be launched on Sept 1

డీజీసీఐ ఆధీనంలో పని చేసే సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించింది. వాటిపై ఆమోదముద్ర వేసింది. అనంతరం డీజీసీఐ తుది అనుమతులు లభించాయి. దీనితో సర్వైకల్ కేన్సర్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌గా సెర్వావాక్ రికార్డు సృష్టించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.

సెర్వావ్యాక్ వ్యాక్సిన్ యాంటీబాడీస్ సర్వైకల్ కేన్సర్‌పై తన బేస్‌లైన్ కంటే 1,000 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. 9-14 సంవత్సరాల్లోపు బాలికలకు ఇవ్వడానికి నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌ కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఎన్‌కే అరోరా చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో సర్వైకల్ కేన్సర్ నివారణ మెడిసిన్ కొరత ఉందని, ఇలాంటి పరిస్థితిలో దీన్ని అభివృద్ధి చేయడం హర్షణీయమని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+