భారత్-చైనా సరిహద్దుల్లో కూలిన భారత్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్, 5గురు మృతి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఈటానగర్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వాయు నిర్వహణ బృందాన్ని తీసుకెళ్తున్న ఎంఐ 17 వి5 హెలికాప్టర్ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో భారత్-చైనా సరిహద్దు వద్ద కూలినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.

ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు భారత ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. 2013 జూన్‌లో ఎంఐ17వి5 విమానం ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా కూలింది. అఫ్పుడు 20 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications