శివకాశీలో మరో ప్రమాదం.. ఐదుగురి మృతి... పలువురికి గాయాలు
తమిళనాడులో గల శివకాశీ పటాకుల ఫ్యాక్టరీలో మరో ప్రమాదం జరిగింది. కలైయార్‌కురుచ్చి వద్ద గల ఫ్యాకర్టీలో పేలుడు సంభవించింది. ప్రమాదంతో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలతో మరిన్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది నిలువరించారు.
ఘటనా స్థలం నుంచి శిథిలాలను తొలగించారు. గాయపడ్డడ వారిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీ రెండు వారాల క్రితం ప్రమాదం జరిగిన సత్తూరుకు దగ్గరలో ఉంది. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో 23 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కెమికల్స్ మిక్స్ చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.

ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని తెలియజేశారు. ప్రధాని మోడీ పీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చొప్పున అందజేస్తారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications