దారుణం: కర్ణాటకలో ఐదుగురు తమిళ కూలీల నరికివేత
బెంగళూరు: తమిళనాడుకు చెందిన ఐదుగురిని కర్ణాటకలో దారుణంగా నరికి చంపారు. హత్యకు గురైనవారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. తమిళనాడు సరిహద్దులో గల చామరాజనగర జిల్లాలోని హరాలే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
మృతులంతా తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీలు. చెరుకు తోటలో పనిచేస్తూ అక్కడే వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్న గుడారాల్లో ఉంటున్నారు.
మృతులను పోలీసులు గుర్తించారు. రోజా (11), శివమ్మ (35), కాశి (40), రాజేంద్ర (35), రాజమ్మ (35) అనే ఐదుగురిని నరికి చంపారు. మంగళవారం ఉదయం చెరుకు పంట యజమాని వచ్చే సరికి వారు మరణించి ఉన్నారు.

కాంట్రాక్టర్ రాజేంద్రకు, కూలీలకు మధ్య మద్యం సేవించిన తర్వాత తగాదా జరిగి ఉంటుందని, ఈ తగాదా కారణంగానే హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిలో రాజేంద్ర కూడా మరణించాడు.
కూలీ కోసం తమిళనాడు నుంచి చెరుకు తోటలో పనిచేయడానికి 16 మంది కూలీలు వచ్చారు. వారంతా అక్కడే ఉంటున్నారు. ఈ హత్యల తర్వాత మిగతా కూలీలు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేయడానికి పదునైన ఆయుధాలతో పాటు భారీ వస్తువులను వాడినట్లు పోలీసులు చెబుతున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications