రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(ఫోటోలు)
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పులతో భయాందోళనకు గురవుతున్న 18వేల మంది ప్రజలు సరిహద్దు గ్రామల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
ఈ దాడుల్లో ముగ్గురు భారత జవాన్లు, ఐదుగురు భారత పౌరులకు గాయలయ్యాయి. పాకిస్తాన్ సైన్యం దాడిని తిప్పికొట్టేందుకు భారత దళాలు ప్రయత్నిస్తున్నాయి. 'త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి' అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేసి ఒక్కరోజు కూడా గడవక ముందే పాకిస్దాన్ ఇలాంటి దాడులకు పాల్పడంతో ఆ దేశంపై అంత మెతకగా వ్యవహరించాల్సిన అగత్యమేమీ లేదని కూడా ప్రభుత్వ, సైనిక వర్గాలు భావిస్తున్నాయి.
అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ సైన్యం పాల్పడుతున్న దుశ్చర్యలకు స్వస్తి పలికే దాకా ఆ దేశంతో చర్చలు లేవని భారత్ తేల్చి చెబుతోంది. నానాటికీ పెరిగిపోతున్న పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో భారత సరిహద్దు భద్రతా దళాలకు చెందిన స్థావరాలకు నష్టం వాటిల్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాక్ కాల్పులపై మోడీ స్పందించాల్సిన అవసరం లేదన్న రాజ్ నాథ్ సింగ్
గత రెండు రోజుల నుంచి జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం తీవ్ర కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ సైన్యం దాడిని తిప్పికొట్టేందుకు భారత దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, పాక్ కాల్పులపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
భారత బీఎస్ఎఫ్ జవాన్లు గట్టిగానే జావాబిస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వం సంతృప్తిగానే ఉందన్నారు. సరిహద్దు వెంబడి ఏమి జరుగుతుందో నిరంతరం తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.
పాక్ సైన్యం కాల్పులను భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది: అరుణ్ జైట్లీ
జమ్మూ సరిహద్దులో పాకిస్తాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, పాక్ సైన్యం కాల్పులను భారత బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయని కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పాక్ సైన్యం కాల్పుల్లో సామాన్యులు కూడా బలవుతున్నారన్నారు. భారత్ ఒక బాధ్యత కలిగిన దేశమని, శాంతి కొనసాగించాలంటే పాకిస్తాన్ వెంటనే కాల్పులను విరమించుకోవాలని జైట్లీ సూచించారు.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ జవాన్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ జవాన్‌ను పరామర్శిస్తున్న ఆధికారి.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ బాలుడును ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ జవాన్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
పర్గ్వాల్, కనాచక్, ఆర్నియా, సాంబా సెక్టార్లలో ఉన్న 60 బీఎస్ఎప్ జవాన్ల శిబిరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో గాయపడ్డ జవాన్‌ను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. రాత్రిపూట పాక్ సైన్యం జరిపిన దాడుల్లో దెబ్బతిన్న తన ఇంటిని చూపిస్తున్న బాధితుడు.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. ప్రాణాలు అరచేత పెట్టుకోని అక్కడున్న ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యం.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. రాత్రిపూట పాక్ సైన్యం జరిపిన దాడుల్లో దెబ్బతిన్న తన ఇంటిని తలుపులను మారుస్తున్న బాధితుడు.

రాత్రిపూట దాడులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. రాత్రిపూట పాక్ సైన్యం జరిపిన దాడుల్లో బాంబ్ షెల్‌ను చూపిస్తున్న మహిళ.

Click it and Unblock the Notifications