జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత.. ఐదుగురు పాక్ ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. తాజగా వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మృతుల్లో జైషే మహమ్మద్ టాప్‌ కమాండర్ జాహీద్ వానీ కూడా ఉన్నారని జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు..

జీఈఎం టాప్ కమాండర్ జాహీద్ వానీ హ‌తం

జీఈఎం టాప్ కమాండర్ జాహీద్ వానీ హ‌తం


కశ్మీర్‌లోని పుల్వామాలోని నైరా, బుద్గాం జిల్లా చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో భద్రతా ధళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 12 గంటలకుపైగా జరిగిన ఈ ఎన్‌కౌంట‌ర్ల‌లో ఐదుగురు ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. మృతుల్లో నలుగురు లష్కరే తొయిబాకు, ఒకరుకు జైషే మహమ్మద్‌కు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించిన వారిలో జీఈఎం టాప్ కమాండర్ జాహీద్ వానీ, పాకిస్థాన్ ఉగ్రవాది ఉన్నారని తెలిపారు. ఇది తమకు పెద్ద విజయం అని విజయ్ కుమార్ ట్వీటర్ లో పేర్కొన్నారు.

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఉగ్రవాదులు ఉన్నారన్న ముందస్తు సమాచారంలో పుల్వామా, బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బంగ్లాలో నక్కి ఉన్న ఉగ్ర‌వాదలు కాల్పులకు పాల్పడ్దారు. దీంతో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఎదురుకాల్పులు జరిపినట్లు జమ్మూకశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. ఐదురుగు ఉగ్రవాదులను మట్టుపెట్టిన‌ట్లు తెలిపారు. ఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఏకే -45 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వివ‌రించారు.

జనవరి నెలలో 12కు పైగా ఎన్ కౌంటర్లు

జనవరి నెలలో 12కు పైగా ఎన్ కౌంటర్లు

ఈ జనవరి నెలలోనే 12కు పైగా ఎన్ కౌంటర్లు జరగగా.. దాదాపు 22 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న దారుణ‌ సంఘటనలో జాహీద్ వానీ ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. తాగా హతమైన వారిలో జాహీద్ , వహిద్ అహ్మద్ రిషి, కఫీల్ , ఇనాయుతుల్లా కాగా మిగతా ఒక ఉగ్రవాది వివరాలు తెలయాల్సి ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+