వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలతో సహ పాకిస్థానీలు అరెస్టు: భారత్ సరిహద్దులో మకాం, ఏం చేస్తున్నారు !

అక్రమంగా భారత్ లో చోరబడిన ఇద్దరు మహిళలతో సహ ఐదు మంది పాకిస్థానీలను రాజస్థాన్ లో అరెస్టు చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదు మందిని అరెస్టు చేసిన పోలీసులు.

|
Google Oneindia TeluguNews

జైపూర్: అక్రమంగా భారత్ లో చోరబడిన ఇద్దరు మహిళలతో సహ ఐదు మంది పాకిస్థానీలను రాజస్థాన్ లో అరెస్టు చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదు మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

భారత్- పాకిస్థాన్ సరిహద్దులోని బార్మార్ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజస్థాన్ లోని లక్సర్ గ్రామం దగ్గర ఐదు మంది పాకిస్థానీలు మకాం పెట్టారు.

Five Pakistani nationals, including two women, arrested by Police at Barmer border

విషయం గుర్తించిన పోలీసులు, ఆర్మీ అధికారులు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదు మంది పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ భూభాగంలో ప్రవేశించారని అంగీకరించారని పోలీసులు చెప్పారు.అయితే వారు భారత్ లోకి ఎందుకు వచ్చారు ? వీరు ఉగ్రవాదులా ? అనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్ సరిహద్దులోనే ఐదు మంది పాకిస్థానీలు పోలీసులకు చిక్కడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇటీవల బెంగళూరు నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు పాకిస్థాన్ ప్రజలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

English summary
Five Pakistani nationals, including two women, arrested by Police at Barmer border with Pakistan near Lakhasar village of Rajastan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X