మావోల దాడి... 5గురు పోలీసుల మృతి...

జార్ఖండ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పెట్రోలింగ్ చేస్తున్నపోలీసుపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో 5 గురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా పోలీసులు మృతి చెందిన అనంతరం వారి వద్ద ఉన్న తుపాకులను ఎత్తుకెళ్లారు మావోలు...

జార్ఖండ్ రాష్ట్ర్రంలోని జంషడ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరయికేల జిల్లాల్లో సాయంత్రం మావోయిస్టుల కోసం గాలింపు జరుపుతున్న పోలీసులపై మావొయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో సంఘటనలో పాల్గోన్న మావోయిస్టులు పోలీసుల తుపాకులను స్వాధినం చేసుకున్నారు. కాగా సంఘటన జరిగిన స్థలం పశ్చిమబెంగాల్‌కు దగ్గర ఉంది. ఇక అనంతరం జిల్లా ఎస్సీతో పాటు ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

Five policemen have been shot dead in an ambush by Maoists near Jamshedpur

మావోయిస్టుల దాడిని జార్ఖండ్ సీఎం రఘబార్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటీ చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు.మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా గత నెల క్రితం మావోయిస్టులు జరిపిన దాడిలో ఒక సహస్త్ర్ర సీమా భల్‌కు చెందిన సైనికుడు గాయపడ్డారు. మరోవైపు మే 28న ఇదే జిల్లాలో జరిగిన దాడిలో 11 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. కాగా అందులో ఒకరు చికిత్స పోందుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+