Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెడ్డి ఇంట్లో ఐదు హస్తి పంజరాలు, జగన్నాథ రెడ్డి ఇంట్లో ఏం జరిగింది ?, ఫ్యామిలీ మొత్తం !

కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలో జగన్నాథ రెడ్డి కుటుంబంలోని అందూ హస్తిపంజరాలుగా కనపడటం కలకలం రేపింది. చిత్రదుర్గా సమీపంలోని చళ్లకెరె టోల్ గేట్ సమీపంలోని జిల్లా జైలు శివార్లలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు బయటపడటంతో ఆ జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఈకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.

ఐదుగురి మరణానికి ఇద్దరు వ్యక్తులే కారణం అనే విషయం వెలుగు చూసింది. కేసును ఛేదించడం ఇప్పుడు చిత్రదుర్గా జిల్లా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. శిథిలం అయిన ఇంట్లో డెత్ నోట్ దొరికింది. ఇంట్లో డెత్ నోట్ చిక్కిలేదని చిత్రదుర్గా జిల్లా ఎస్పీ అంటున్నారు. అయితే డెత్ నోట్‌లో ఇద్దరు వ్యక్తుల పేర్లను ఆ కుటుంబం రాసిందని, దొరికిన సూసైడ్ నోట్‌లో ఇద్దరు వ్యక్తులు చిత్రహింసల వల్లే మేము సామూహిక ఆత్మహత్య చేసుకుంటున్నామని రాశారని కన్నడ మీడియా అంటోంది.

Five skeletons were found in Jagannath Reddys house.

డెత్ నోట్ ఆధారంగా ఇప్పుడు ఆ ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిత్రదుర్గాకు చెందిన ఓ వ్యక్తి, దొడ్డ సిద్దవ్వనహళ్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానాలు ఉన్నా వారి పేర్లు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. భూవివాదం కేసు విచారణ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని, అందుకే మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఇంటి యజమాని డెత్ నోట్‌లో పేర్కొన్నాడని తెలిసింది. కేసు విచారణలో ఉండటంతో నిందితుల ఇద్దరి పేర్లను పోలీసులు వెల్లడించలేదు.

డెత్ నోట్‌లో పలు అనుమానాలున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఓ ఇంట్లో మృతదేహాలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచి చూశారు. పెద్దగా ఉన్న ఆ ఇంటిలోని ప్రతి గదిలోనూ మృతుల అస్థిపంజరాలు కనిపించాయి. గతంలో ఈ ఇంట్లో రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డి (70), ఆయన భార్య ప్రేమావతి (60), కుమార్తె త్రివేణి (42), కుమారులు కృష్ణారెడ్డి (40), నరేంద్రరెడ్డి (38) నివసించేవారని పోలీసు అధికారులు తెలిపారు.

Five skeletons were found in Jagannath Reddys house.

ఇదే ఇంటిలో ఇప్పుడు ఐదు ఆస్తిపంజరాలు బయటపడ్డాయి. జగన్నాథరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే జగన్నాథ రెడ్డి పిల్లలు ఎవరికీ పెళ్లి కాలేదని, పెద్ద కొడుకు మంజునాథ్ రెడ్డి అంతకుముందే చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. బెంగుళూరులోని బిడది పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ కేసుతో సంబంధం ఉందని జగన్నాథరెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డిపై దోపిడీ కేసు నమోదైంది. నరేంద్ర రెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడు.

Five skeletons were found in Jagannath Reddys house.

తన స్నేహితులతో కలిసి బిడది సమీపంలో వాహనాలు అడ్డగించి దారిదోపిడీలకు పాల్పడుతున్నాడని కేసు నమోదు కావడంతో నరేంద్రరెడ్డి కొంతకాలం జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసుతో జగన్నాథరెడ్డి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. 2019లో డెత్ నోట్ రాసి కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. శిధిలమైన జగన్నాథరెడ్డి ఇంట్లో ఐదు మంది మనుషుల అస్థిపంజరాలతో పాటు, కుక్క ఎముకలు బయటపడ్డాయి,

రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథరెడ్డి నివాసంలో ఐదుగురు ఆత్మహత్యలకు సంబంధించిన ఐదు మంది అస్థిపంజరాలు రెండు రోజుల క్రితమే లభ్యమయ్యాయి. వీరంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు సమాచారం. ఆహారంలో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని, ఇంట్లో ఉండే కుక్కకు కూడా విషం కలిపిన అన్నం పెట్టి ఉంటారని పోలీసులు అంటున్నారు. కుక్క చనిపోవడంతో దాని ఆస్తిపంజరం ఆ ఇంట్లో లభ్యం అయ్యింది విద్యావంతులైన జగన్నాథరెడ్డి కుటుంబంలోని ఐదు మంది ఇలా అస్తిపంజరాలు అయి కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+