బీజేపీలో కోటీశ్వరులు, కాంగ్రెస్ లో క్రిమినల్స్ ? ఐదు రాష్ట్రాల విజేతల్లో వీరే టాప్ ? ఏడీఆర్ రిపోర్ట్ !
తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వాల ఏర్పాటు కూడా జరిగిపోయింది. ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జడ్పీఎం విజయం సాధించాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే విజేతలపై తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో కీలక అంశాలు వెలుగుచూశాయి. వీటిని పరిశీలిస్తే ఈ ఎన్నికలు ఎలా జరిగాయన్నది తేలిపోతోంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజేతల్ని గమనిస్తే వీరిలో అత్యధికులు ధన బలం లేదా భుజబలంతో గెలిచిన వారే అని స్పష్టమవుతోంది. ఇందులోనూ గెలిచిన 678 మంది అభ్యర్థుల్లో 88 శాతం మంది కోటీశ్వరులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక వెల్లడించింది. మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ఆస్తులను విశ్లేషిస్తే వారిలో 594 మంది కోటీశ్వరులుగా తేలింది.

కోటీశ్వరులైన ఎమ్మెల్యేల జాబితాలోనూ బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీకి చెందిన 342 మంది గెలిచిన ఎమ్మెల్యేలలో 298 మంది కోటీశ్వరులే. కాంగ్రెస్ నుంచి గెలిచిన 235 మంది ఎమ్మెల్యేల్లో 209 మంది కోటీశ్వరులే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 39 మందిలో 38 మంది కోటీశ్వరులే. మిజోరంలో గెలిచిన జడ్పీఎంలో 27 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది కోటీశ్వరులే. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో 119 మంది విజేతల్లో 114 మంది కోటీశ్వరులే. ఛత్తీస్‌గఢ్‌లో 90 మంది విజేతల్లో 72 మంది కోటీశ్వరులే. మిజోరం విజేతల్లో 40 మందిలో 34 మంది కోటీశ్వరులే.
మరోవైపు ఈ ఐదు రాష్ట్రాల్లో గెలిచిన 678 మంది అభ్యర్థుల్లో 253 మంది అంటే 37శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. వీరిలో 146 మంది అభ్యర్థులు అంటే 22 శాతం మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.అలాగే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 235 మందిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు 114 మంది ఉన్నారు. అలాగే మరో 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. బీజేపీకి చెందిన 66 105 మంది క్రిమినల్ కేసులు కలిగిన వారు ఉంటే, మరో 51 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని తేలింది.












Click it and Unblock the Notifications