మద్యం తాగించి ఐదుగురు మహిళలపై అత్యాచారం

 Five women raped in Bihar
ఆర: బీహార్ రాష్ట్రంలో ఐదుగురు మహిళలపై మూకుమ్మడిగా లైంగిక పైశాచికత్వానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. ఐదుగురు మహిళలపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. బలవంతంగా మద్యం తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. భోజ్‌పూర్‌ జిల్లా కుర్మూరీలో సంచలనం సృష్టించిన ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం - బాధితులు గ్రామంలో చెత్త ఏరుకొని జీవిస్తున్నారు. బుధవారం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళుతున్న వీరిని ఇద్దరు యువకులు అటకాయించారు. ఆయుధంతో బెదిరించి వారిని ఎత్తుకుపోయారు. తీవ్రంగా కొట్టి బలవంతంగా మద్యం తాగించారు. తాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని బెదిరించారని వారు చెప్పారు. ఆయుధంతో భయపెడుతూ, ఐదుగురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై ఈ దారుణం జరిగిందని డిఎస్‌పి కెకె సింగ్ చెప్పారు.

పార్టీ ఆఫీస్‌లోనే అత్యాచారం..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అత్యాచార ఘటనలతో అప్రతిష్టపాలవుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే తలవంపులు తెస్తున్నారు. దుర్ద్వాన్‌ జిల్లా దుర్గాపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో బాబూ మండల్‌ కీలక నేత. అయితే, ఆయన సోదరుడు భోలా మండల్‌ కూడా ఘనుడే. 12 ఏళ్ల మైనర్‌ బాలికని బలవంతంగా తీసుకెళ్లి పార్టీ ఆఫీస్‌లోనే అతడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమె కేకలు విని జనం పార్టీ ఆఫీస్‌ను ముట్టడించారు. భోలాను చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు.

స్కూలులో లైంగిక దాడి

ఢిల్లీలోని ఓ స్కూలులో చిన్నారిపై ఓ కీచక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలిక మంగళవారం లైబ్రరీ గదికి వచ్చింది. అక్కడే మాటువేసిన 24 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలి వెంట ఉన్న సహ విద్యార్థులు అడ్డుకోవడంతో పారిపోయాడు. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+