Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుపుకు ఐదు అడ్డంకులు ? దాటితే అధికారమే..

మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 230 సీట్లకు ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో గెలిచేదెవరంటే కాంగ్రెస్సే అని దాదాపు ఎన్నికల సర్వేలు తేల్చేశాయి. మధ్యలో ఏడాదిన్నర మినహాయిస్తే 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, ఇందులో మధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని లాక్కుని ప్రభుత్వాన్ని కూల్చేసిన వైనం ఇవన్నీ కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారాయి. దీంతో ఈసారి ఎలాగైనా గట్టెక్కేందుకు సీఎం అభ్యర్ధిని కూడా ప్రకటించకుండా బరిలోకి దిగిన బీజేపీకి కాంగ్రెస్ విసురుతున్న సవాళ్లు చికాకుపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే ఇప్పటి వరకూ వెలువడిన ఒపీనియన్ పోల్స్ కు భిన్నంగా క్షేత్రస్ధాయిలో కనిపిస్తున్న ఐదు అంశాలేనన్న చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు తోడు, అగ్రవర్ణాల మద్దతు లేకపోవడం, నిమ్న వర్గాలపై అతిగా ఆధారపడటం, సీనియర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం.

five worries for congress victory in madhya pradesh amid opinion poll predictions

మధ్యప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అగ్రవర్ణాల్లో ఏకంగా 58 శాతం మద్దతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 33 శాతం మద్దతు మాత్రమే దొరికింది. ఇప్పటికీ అదే పరిస్ధితి అక్కడ కొనసాగుతున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలు ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నారు. కులాల సర్వే హామీతో ఓబీసీ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. కానీ ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఎన్నికల్లో భారీ దెబ్బలు ఖాయం.

అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం లేకపోవడంతో ఇన్నాళ్లు ఎక్కువగా గ్రూపులు కనిపించలేదు. 2018 ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా పేరుతో వర్గాలు కనిపించేవి. కానీ సింధియా బీజేపీకి ఫిరాయించడంతో కమల్ నాథ్ పీసీసీ ఛీఫ్ గా కొనసాగుతున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ కు అధికారం వచ్చేలా కనిపిస్తుండటంతో ఆయన ప్రత్యర్ధులు తమ అస్త్రాలకు పదును పెడుతున్నారు. అవకాశం వస్తే సీఎం పదవికి పోటీదారులుగా మారేలా ఉన్నారు. ఇందులో దిగ్విజయ్ తో పాటు ఇతర నేతలు కనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+