ఈ నగరాల నుంచి అయోధ్యకు కొత్త విమాన సర్వీసులు: టైమింగ్స్ ఇవే

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. బాల రాముడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు పోటెత్తుతున్నారు. చలిని సైతం లెక్క చేయట్లేదు. రోజూ రెండు లక్షలమందికి పైగా భక్తులు రాములోరిని దర్శించుకుంటోన్నారు.

ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు.

Flights to Ayodhya from these cities set to launch on Feb 1

మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు. స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్‌ https://online.srjbtkshetra.org/#/login‌ను సందర్శించాల్సి ఉంటుంది.

రోజురోజుకూ అయోధ్య రామయ్యను దర్శించడానికి భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎయిర్ కనెక్టివిటీని కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి అయోధ్యలోని వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెగ్యులర్ విమానాలను నడిపించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

ఢిల్లీ- అయోధ్య: ఉదయం 10:40 నిమిషాలకు ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరే ఈ విమానం మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు ఉదయం 8:40 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరి 10 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ విమానం రాకపోకలు సాగిస్తుంది.

చెన్నై- అయోధ్య: మధ్యాహ్నం 12:40 నిమిషాలకు చెన్నై నుంచి బయలుదేరే ఈ విమానం 3:15 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 4 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి 7:20 నిమిషాలకు చెన్నైకి చేరుకుంటుంది. ప్రతి రోజూ ఈ విమానం అందుబాటులో ఉంటుంది.

అహ్మదాబాద్- అయోధ్య: తెల్లవారు జామున 6 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరే ఈ విమానం 8 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి 2:25 నిమిషాలకు అహ్మదాబాద్‌కు చేరుతుంది. బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులూ రాకపోకలు సాగిస్తుందీ ఫ్లైట్.

జైపూర్- అయోధ్య: ఉదయం 7:30 గంటలకు జైపూర్ నుంచి బయలుదేరే ఈ విమానం 9: 15 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3: 45 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరి 5:30 గంటలకు జైపూర్‌కు చేరుతుంది. 2, 4, 6, 7 తేదీల్లో మాత్రమే ఈ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తుంది.

పాట్నా- అయోధ్య: మధ్యాహ్నం 2:25 నిమిషాలకు పాట్నా నుంచి బయలుదేరే ఈ విమానం 3: 25 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు అయోధ్య నుంచి బయలుదేరి 2 గంటలకు జైపూర్‌కు చేరుతుంది. 2, 4, 6, 7 తేదీల్లో మాత్రమే ఈ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తుంది.

దర్భంగా- అయోధ్య: ఉదయం 11:20 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరే ఈ విమానం మధ్యాహ్నం 12:30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9: 40 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరి 10:50 నిమిషాలకు దర్భంగా చేరుతుంది. 2, 4, 6, 7 తేదీల్లో మాత్రమే ఈ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తుంది.

ముంబై- అయోధ్య: ఉదయం 8:20 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరే ఈ విమానం 10: 40 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11: 15 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరి 1:20 నిమిషాలకు ముంబైకి చేరుతుంది. ప్రతి రోజూ ఈ విమానం రాకపోకలు సాగిస్తుంది.

బెంగళూరు- అయోధ్య: ఉదయం 10:50 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే ఈ విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2: 10 నిమిషాలకు అయోధ్య నుంచి బయలుదేరి సాయంత్రం 4:45 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. 1, 3, 5, 7 తేదీల్లో మాత్రమే ఈ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+