గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం గ్రాండ్ గాడ్జెట్ సేల్ ను ప్రారంభించింది. ప్రమోషనల్ లో భాగంగా వివిధ రకాల గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 14 తో ఆ ఆఫర్ ముగుస్తోంది.

ప్రమోషనల్ లో బాగంగా వివిధ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది ప్లిప్ కార్ట్.స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ల్యాప్ ట్యాప్ లు, వెరియబుల్స్ తో పాటు బ్యూటీ సంబంధిత ఉత్పత్పులు ఈ ఆఫర్ లో ఉన్నాయి.

Flipkart Grand Gadget Sale: Discounts on MacBook Air, Apple Watch and others

ఈ ఆఫర్లలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ,జే మ్యాక్స్ ,లెనోవా ప్యాబ్ 2 సిరిసెస్, ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ (కోర్ ఐ 5 వ, తరం) ల్యాప్ టాప్, హెచ్ పీ ఏపీయూ క్వాడ్ కోర్ ఏ 8 ల్యాప్ టాప్, ఆపిల్ వాచ్ సిరీస్ 1, 2, ఫిట్ బిట్ చార్జ్ ,హెచ్ ఆర్, జేబీఎల్ ప్లిప్ 2, పిల్లిప్స్, వైర్ లెస్ పోర్టబుల్ స్పీకర్ వంటి గాడ్జెట్లపై కంపెనీ ధరలను తగ్గించింది.

లెనోవా ప్యాబ్ సిరిసెస్ 2పై ప్రారంభ డిస్కౌంట్ 6 శాతం నుండి 13 శాతం మధ్యలో ఉంది. డిస్కౌంట్ తో పాటు , ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ప్లిప్ కార్ట్ లెనోవో ప్యాబ్ 2 వేరియంట్ ధర రూ.9,999లకే అందుబాటులో ఉండగా, ఈ ఫోన్ పై రూ.9000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.

అంతేకాక ప్యాబ్ 2 ప్లస్ ను రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై కూడ 13 రూపాయాలవరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.శాంసంగ్ గెలాక్సీ జే మ్యాక్స్ పై 14 శాతం డిస్కౌంట్ ను ప్లిప్ కార్డ్ ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ తో పాటు మూడు నెలలు, ఆరునెలలు ఎలాంటి ధరలు లేని ఈఎంఐలను అందుబాటులో ఉంచింది.

ల్యాప్ ట్యాప్ లపై అదనంగా రూ.2 వేలను డిస్కౌంట్ ఇస్తోంది. యాక్సిస్ బ్యాండ్, బుజ్ క్రెడిట్ కార్డు హెల్డర్స్ కు 5 శాతం డిస్కౌంట్ ను ఇస్తోంది. మిగతా గాడ్జెట్ లపై కూడ ప్లిప్ కార్డ్ డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. తొమ్మిదిరోజులపాటు ప్లిప్ కార్డు ఫ్యాషన్ సేల్ కూడ నిర్వహిస్తోంది. దీంట్లో 50 బ్రాండ్స్ పై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్యాషన్ సేల్ ఈ నెల 18 తో ముగుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Flipkart has kick started its Grand Gadget Sale. As part of the promotion, the e-tailer is offering discounts on various gadgets and electronics. The three-day sale will run until June 14, with the devices up for discount including smartphones, cameras, laptops, wearables and beauty-related gadgets.
Please Wait while comments are loading...