వర్షాల బీభత్సం: ముంచెత్తిన వరదలు (వీడియో)
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలలోని ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. వరదల దెబ్బకు 81 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది గల్లంతు అయ్యారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాలలోని వంతెనలుకూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అయ్యింది.

పలు గ్రామాలలోని ప్రజల మధ్య సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు, రెస్య్కూ సిబ్బంది పలు గ్రామాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సర్వం కొల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అనేక రాష్ట్రాలలో ఒక్క సారిగా వరదలు ముంచెత్తడంతో కేంద్రం సహాయక చర్యలకు పూర్తి సహకారం అందిస్తున్నది. సైనికులు రంగంలోకిదిగారు. ముందు జాగ్రతగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. రైల్వే ట్రాక్ లు, రోడ్ల మరమత్తులు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications