అస్సాం వరదలు: 106 మంది బలి - 56లక్షల నిరాశ్రయలు - బిహార్ లో 25లక్షల మంది ఎఫెక్ట్, 8 మృతి

రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈశాన్య, తూర్పు రాష్ట్రాలైన అస్సాం, బీహార్ లో వరద బీభత్సం కొనసాగుతున్నది. ఆ రెండు రాష్ట్రాల్లో గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలతోపాటు పెద్ద నదులూ ఉప్పొంగి జనావాసాలను ముంచెత్తాయి. ప్రధానంగా అస్సాం ద:ఖదాయినిగా పిలిచే బ్రహ్మపుత్ర నది ఈసారి కూడా వందల గ్రామాలను ముంచెత్తింది.

వరదల కారణంగా అస్సాంలో మంగళవారం నాటికి 108 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 33 జిల్లాలకుగానూ 30 జిల్లాల్లో 56 లక్షల మంది ప్రభావానికి గురయ్యారని, 5305 గ్రామాల్లో వందలాది ఇళ్లు, వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయని అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఏఎస్డీఎంఏ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కలిపి దాదాపు 25 వేల మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

floods: 103 dead, 56 lakh affected in Assam: 25 lakh displaced, 8 dead in Bihar

తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 615 సహాయ శిబిరాల్లో దాదాపు 1.5 లక్షల మంది తలదాచుకున్నారు. వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు సోనోవాల్ సర్కారు తలా రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. వరదల కారణంగా 2.6లక్షలహెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్‌లో భారీగా వరద నీరు రావడంతో వందలాది వన్యప్రాణాలు చనిపోయాయి. ఇంకొన్ని వరదలో కొట్టుకుపోయి సుదూర ప్రాంతాలకు చేరాయి.

హిమాలయ దేశం నేపాల్ పరీవాహక ప్రాంతాలతోపాటు బీహార్ అంతటా భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా సుమారు 25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మంగళవారం నాటికి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి 38 జిల్లాలకుగానూ 11 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+