వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా సీఎం కుర్చీపై కాంగ్రెస్ కన్ను.. రేపే బల పరీక్ష..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేపే బల పరీక్ష.... గోవా సీఎం కుర్చీపై కాంగ్రెస్ కన్ను....!! | Oneindia Telugu

పనాజీ : గోవా రాజకీయం మరోసారి వేడెక్కింది. మనోహర్ పారికర్ మరణంతో ముఖ్యమంత్రి పీఠమెక్కారు బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ సావంత్. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలవడం చర్చానీయాంశమైంది. అదలావుంటే గోవా అసెంబ్లీలో బుధవారం (20.03.2019) నాడు బలపరీక్ష ఉంటుందని ప్రకటించారు కొత్త సీఎం ప్రమోద్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యక్ష రాజకీయాలకు అద్వాని గుడ్ బై ప్రత్యక్ష రాజకీయాలకు అద్వాని గుడ్ బై

మనోహర్ పారికర్ మరణించడంతో 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించినట్లు తెలిపారు ప్రమోద్ సావంత్. అప్పటివరకు తనకు శుభాకాంక్షలు చెప్పొద్దని, పూల బొకేలు అందించడం లాంటివి చేయొద్దని కోరారు. అదలావుంటే పారికర్ మరణంతో గోవా రాజకీయం వేడెక్కింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలంటూ కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ లేఖ అందించారు.

Floor test in Goa Assembly tomorrow, CM Pramod Sawant confirms

40 స్థానాలకు గాను గోవా అసెంబ్లీలో ప్రస్తుతం 36 మంది సభ్యులున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు 14 మంది, ఎన్సీపీకి చెందిన సభ్యుడు ఒకరుండగా.. బీజేపీకి చెందినవారు 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెరో ముగ్గురు చొప్పున సభ్యులున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతివ్వడంతో కమలం బలం 21 కి చేరింది.

English summary
Within 12 hours of taking charge as Goa Chief Minister, Pramod Sawant has said that he will prove the majority at the floor of the Goa Assembly tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X