వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాణా స్కాం: లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్ష రేపు ఖరారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Fodder scam : దాణా స్కాం: లాలూకు శిక్ష ఖరారు వాయిదా !

పాట్నా: పశు దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు న్యాయస్థానం శిక్షను గురువారం ఖరారు చేయనుంది. ఆయనకు ఎన్నేళ్లు శిక్ష పడనుందో ఖరారు కానుంది. బుధవారమే ఖరారు కావాల్సింది. కానీ ఒక రోజు వాయిదా పడింది. న్యాయవాది విందేశ్వరి ప్రసాద్ మృతిచెందడంతో తీర్పును రేపటికి వాయిదా వేశారు.

అంతకుముందు, దాణా కుంభకోణం కేసులో దోషి బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాంచీలోని బిర్సాముండా కారాగారం నుంచి రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు.

Fodder scam case: Quantum of sentence to be pronounced tomorrow

డిసెంబరు 23న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూతో పాటు మరో 15 మందిని దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. వీరికి శిక్ష ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో లాలూ ప్రత్యేక పోలీసు భద్రత మధ్య కోర్టుకు వచ్చారు.

1991-94 మధ్య దేవ్‌గఢ్‌ ఖజానా నుంచి రూ.89.27లక్షల మొత్తాన్ని తప్పుడు వివరాలతో కాజేయడానికి సంబంధించిన కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 23న లాలూని దోషిగా తేల్చింది. 1996లో పట్నా హైకోర్టు కుంభకోణంపై విచారణకు ఆదేశాలిచ్చింది.

38 మందిపై సీబీఐ అభియోగపత్రాలు నమోదు చేశారు. వీరిలో 11 మంది చనిపోయారు. ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించారు. వారికి శిక్షలుపడ్డాయి. ముగ్గురు నిందితులు సాక్షులుగా మారారు. చాయీబాసా ఖజానా నుంచి అక్రమంగా రూ. 37.7 కోట్ల నగదు స్వాహా చేసిన కేసులో 2013 సెప్టెంబరు 30న లాలూ, మరో మాజీ ముఖ్యమంత్రి మిశ్ర, మరికొందరికి శిక్షలు పడ్డాయి.

అదే ఏడాది డిసెంబరులో సుప్రీం కోర్టు లాలూకు బెయిల్‌ ఇచ్చింది. ఇది లాలూకు రెండో కుంభకోణానికి సంబంధించిన శిక్ష. ఆయనపై ఇలాంటివి మరో మూడు కేసులున్నాయి.

English summary
The Special CBI Court in Ranchi deferred the pronouncement of quantum of sentence in the fodder scam case for tomorrow. RJD chief Lalu Prasad Yadav and 15 others were convicted in a fodder scam case 21 years after it had surfaced while acquitting six others including another former chief minister Jagannath Mishra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X