4వ దాణా స్కాం కేసు: లాలూకు ఏడేళ్ల జైలు, రూ.30లక్షల జరిమానా
న్యూఢిల్లీ: దాణా కుంభకోణం నాల్గవ కేసులోనూ బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు జైలు శిక్ష పడింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 30లక్షల జరిమానా విధించడం జరిగింది.
రూ. 3.18కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో శనివారం రాంచీలోని సీబీఐ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజా జైలు శిక్షతో లాలూకు మొత్తం 20.5ఏళ్ల జైలు శిక్ష పడినట్లయింది.












Click it and Unblock the Notifications