టాప్ సింగర్ కన్నుమూత: దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ప్రఖ్యాత జానపద గాయని, పద్మభూషణ్ పురస్కారం గ్రహీత శారదా సిన్హా కన్నుమూశారు. ఆమె వయస్సు 72 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేన్సర్‌కు చికిత్స తీసుకుంటోన్నారు. కిందటి నెల 25వ తేదీన ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
బిహార్‌కు చెందిన గాయని శారదా సిన్హా. ఛత్ పూజలకు సంబంధించిన వందల పాటలు పాడారు. బిహార్ కోకిలగా గుర్తింపు పొందారు. ఆమె పాడిన జానపద గీతాలు ప్రతి వేడుకల్లోనూ వినిపిస్తూ ఉంటాయి. పలు భోజ్‌పురి సినిమాల్లోనూ పాటలు పారు. మైథిలీ, భోజ్‌పురి పాటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చారు.

ఆమె చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ భూషణ్ పురస్కారాన్ని అందించి గౌరవించింది. 2017లో శారదా సిన్హా క్యాన్సర్ బారిన పడ్డారు. మ్యెలొమాకు గురయ్యారు. బోన్ మ్యారోకు సంబంధించిన కేన్సర్ ఇది.
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కిందటి నెల 25వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ అంకాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆమెకు అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సంతాపం తెలిపారు. శారదా సిన్హా మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. మైథిలీ, భోజ్‌పురి భాషల్లో ఎన్నో సంవత్సరాలుగా వందల పాటలు పాడారని గుర్తు చేసుకున్నారు. ఛత్ పూజల పాటలతో ఆమె చిరస్మరణీయంగా మిగిలిపోయారని పేర్కొన్నారు.
శారదా సిన్హా మృతి పట్ల కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, శర్బానంద సొనొవాల్, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, మోహన్ చరణ్ మాఝీ, హిమంత బిశ్వ శర్మ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ ఎంపీ మనోజ్ తివారి, ఆ పార్టీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ తదితరులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications