వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బకు దిగొచ్చిన అమిత్ షా?: ఢిల్లీకి రావాలని 'రాజ్‌భర్‌'కు కబురు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్ని కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మధ్య చిచ్చుపెడుతూ రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీతో తెగదెంపులు చేసుకుని మిత్రపక్షం టీడీపీ ఇప్పటికే షాక్ ఇవ్వగా.. ఉత్తరప్రదేశ్ లోనూ ఆ పార్టీ మిత్రపక్షమైన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)పెద్ద షాకే ఇవ్వబోయింది. ఇంతలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిగిరావడంతో పెద్ద డ్యామేజ్ తప్పినట్టయింది.

Following UP Rajbhar accusations, Amit Shah calls him for a meeting

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తమతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరించిందని ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి.. ఈనెల 23న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలను బాయ్‌కాయ్ చేస్తామంటూ హెచ్చరించారాయన.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనతో సమావేశం కావాల్సిందేనని అల్టిమేటమ్ జారీ చేశారు. ఇప్పటికే గోరఖ్ పూర్, ఫల్పూర్ నియోజకవర్గాల్లో కంగు తిన్న బీజేపీని.. ఎస్‌బీఎస్‌పీ హెచ్చరికలు మరింత ఆందోళన చెందేలా చేశాయి. దీంతో ఎట్టకేలకు అమిత్ షా దిగిరాక తప్పలేదు.

అదే జరిగితే..: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మరో గట్టి షాక్ తగలనుందా?అదే జరిగితే..: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి మరో గట్టి షాక్ తగలనుందా?

రాజ్‌భర్‌ను ఢిల్లీ రావాల్సిందిగా అమిత్ షా కబురు పెట్టారు. దీంతో రాజ్‌భర్ హస్తినకు బయలుదేరారు. మధ్యాహ్నం 2గం.కు రాజ్‌భర్‌తో అమిత్‌షా సమావేశమవుతున్నారు.

కాగా. యూపీ అసెంబ్లీలో 403 స్థానాలుండగా 8 మంది సభ్యులను బీజేపీ రాజ్యసభకు పంపనుంది. అయితే ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకుని తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకోవాలనేది బీజేపీ ప్లాన్.

అయితే నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీలో మిత్రపక్షంగా ఉన్న ఎస్‌బీఎస్‌పీ.. ఆ తొమ్మిదో స్థానాన్ని తమకు కేటాయించాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. లేనిపక్షంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటామని హెచ్చరిస్తోంది. ఇదే విషయంపై అమిత్ షా-రాజ్‌భర్ మధ్య ఈరోజు చర్చ జరగనున్నట్టు సమాచారం.

English summary
Uttar Pradesh minister and Bharatiya Janata Party (BJP) ally OP Rajbhar, on Monday, accused the BJP of not following the "coalition dharma" in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X