కర్నాటకలో విషాదం: ఆలయంలో ప్రసాదం సేవించి 12 మంది మృతి

Recommended Video

    Karnataka Chamarajanagar Temple Prasad Case: CM Kumaraswamy Meets Hospitalised People

    కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. హనూర్‌లోని సుల్వాడీ కిచ్చుగుట్టి మారమ్మ ఆలయంలో ఆహారం తిని 12 మంది మృతి చెందారు ఇందులో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది. మరో 80 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేయడం జరిగింది. ఆహారం సేవించిన భక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని మైసూరు, కొల్లెగల్, కమగెరె ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    Food poisoning at Hindu temple ceremony in India leaves at least 12 dead

    భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిసి ఉండొచ్చని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ప్రస్తుతానికి శాంపిల్స్ తీసుకుని పరీక్షల నిమిత్తమై లాబొరేటరీకి పంపామని అధికారులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో 12 మంది పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స కోసం మైసూరుకు తరలించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొత్తగా నిర్మించిన మారమ్మ ఆలయంలో భక్తులు ఎక్కువగా వచ్చారు. వారికి ప్రసాదాలు అందజేశారు ఆలయ నిర్వహకులు. ప్రసాదం తీసుకున్న భక్తులు వెంటనే వాంతులు చేసుకున్నారు. మరికొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొందరు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు.

    విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం కూడా చేరుకుని వైద్యాధికారులు అస్వస్థతకు గురైన భక్తులకు ప్రాథమిక చికిత్స చేశారు. ఘటనపై షాక్‌కు గురైన ముఖ్యమంత్రి కుమారస్వామి భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు కర్నాటక ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించింది.ఇదిలా ఉంటే చికిత్స పొందుతున్న భక్తులను సీఎం కుమార స్వామి పరామర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+