వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మాస్వరాజ్‌కు రాహుల్ ప్రశంసలు, కానీ: నెటిజన్ల సెటైర్లు

ఐక్య రాజ్య సమితి వేదికపై భారతవాణిని గట్టిగా వినిపించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి వేదికపై భారతవాణిని గట్టిగా వినిపించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.

ఐరాస వేదికగా ఆమె చేసిన ప్రసంగంలో ఐఐటి, ఐఐఎంలను ప్రస్తావించినందుకు రాహుల్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో తెలిపారు.

ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల గొప్ప దూరదృష్టి, ఘన వారసత్వాలను గుర్తించినందుకు కృతజ్ఞతలు సుష్మా జీ అని రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు.

For Sushma Swaraj's UN Speech, A 'Thank You' Barb From Rahul Gandhi

కాగా, ఈ ట్వీట్ పైన రాహుల్ పైన సెటైర్లు వస్తున్నాయి.ఐఐటీలు, ఐఐఎంలను తామే నెలకొల్పామని గుర్తు చేస్తూ, రాహుల్ ఈ కామెంట్ చేయగా, నెటిజన్లు వెంటనే స్పందించారు.

విద్యాసంస్థలతో పాటు పెద్ద పెద్ద కుంభకోణాలు సైతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎద్దేవా చేశారు. మీరు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, సుష్మా దేశం గురించి మాట్లాడారని గుర్తు చేశారు.

English summary
The Congress has issued a barbed response to foreign minister Sushma Swaraj's tough speech at the United Nations General Assembly, which ripped apart Pakistan. This morning, a tweet from party vice president Rahul Gandhi read, "Sushma ji, thank you for finally recognising Congress governments' great vision and legacy of setting up IITs and IIMs".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X