బెంగళూరులో అనూహ్యం-ఎదురెదురుగా అమెరికా, రష్యా యుద్ద విమానాలు ?
కర్నాటక రాజధాని బెంగళూరులో ఇవాళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. అంతర్జాతీయ స్ధాయిలో కత్తులు నూరుకుంటున్న అమెరికా, రష్యా ఇరుదేశాలకు చెందిన యుద్ధ విమానాలు ఎదురెదురయ్యాయి. దీంతో వీటిని చూసేందుకు జనం ఎగబడ్డారు. రష్యా యుద్ధంలో తలదూర్చిన అమెరికా.. ఉక్రెయిన్ కు మద్దతునిస్తోంది. దీంతో ఎప్పుడో మొదలైన ఈ యుద్దం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి. ఇలాంటి సమయంలో ఇరుదేశాల యుద్ద విమానాలు ఎదురెదురుపడటం సంచలనం రేపింది.
ప్రస్తుతం బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో 'ఏరో ఇండియా' కు నగరంలోని యలహంక ఎయిర్ బేస్ ఆతిధ్యమిస్తోంది. ఇందులో ఓ అరుదైన దశ్యం చూపరుల్ని ఆకట్టుకుంది. అమెరికన్, రష్యన్ స్టెల్త్ ఫైటర్స్ (యుద్ధ విమానాలు ) కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. రష్యన్ Su-57 ఐదవ తరం ఫైటర్ జెట్, అమెరికన్ F-35 లైట్నింగ్ II అత్యంత అధునాతన ఐదవ తరం ఫైటర్లుగా పేరుంది. ఈ రెండు యుద్ద విమానాలు ఎదురుపడాలంటే అమెరికా, రష్యా నేరుగా యుద్ధం చేసుకోవాలి.

SU-57 Demo Flight In Bengaluru 🔥
— Defence Squad (@Defence_Squad_) February 10, 2025
Video Credit: _world_of_light (Insta) pic.twitter.com/tIpbJzIZek
అదేమీ లేకుండా బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షోలో ఇలా ఎదురెదురు కావడంతో వీటిని చూసేందుకు జనం ఆసక్తి చూపారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు డైలీ ఏరియల్ డిస్‌ప్లేలో Su-57, F-35 విమానాలు పాల్గొనబోతున్నాయి. అలాగే సు-57 'ఫెలోన్' విమానం యలహంక నుంచి బయలుదేరిన వీడియో వైరల్ అవుతోంది. అలాగే ఎఫ్ -35ను చూసేందుకు వీక్షకులు తరలివస్తున్నారు. ఇలా ప్రపంచంలోనే రెండు అగ్రదేశాల యుద్ధ విమానాలను దగ్గరి నుంచి చూసేందుకు జనానికి మంచి అవకాశంగా ఎయిర్ షోను చెప్తున్నారు.












Click it and Unblock the Notifications