మతఘర్షణలు, హత్యకు గురైన వారికి రూ. కోటి పరిహారం ప్రకటించిన సీఎం !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్బంలో మంగళూరుతో పాటు కోస్తా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సందర్బంలో జరిగిన మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు హత్యకు గురైనారు.
కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో జరిగిన మత ఘర్షణల్లో చనిపోయిన నలుగురు యువకుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. దుండగుల చేతిలో హత్యకు గురైన దీపక్ రావు, మసూద్, మహమ్మద్ ఫాజిల్, అబ్దుల్ జలీల్ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

మతపరమైన గొడవల కారణంగా మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. 2018 జనవరి 3న మంగళూరులో కాటిపాళ్లకు చెందిన దీపక్‌రావు, గతేడాది జూలై 19న బళ్లారికి చెందిన మసూద్. 28న మంగల్‌పేటకు చెందిన మహ్మద్ ఫాజిల్, డిసెంబర్ 24న కాటిపాళ్లకు చెందిన అబ్దుల్ జలీల్‌లను కొందరు వ్యక్తులు హత్య చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యువకుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున మత విద్వేషాల బలి అయిన బాధిత కుటుంబానికి పరిహారం సొమ్ము మంజూరు చేయాలని కర్ణాటక డీజీపీ హోమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌ను అభ్యర్థించారు. జూన్ 19వ తేదీన పరిహారం అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
కర్ణాటకలో ఇప్పడు సీఎం సిద్దరామయ్య మార్క్ రాజకీయం మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications