ఫోర్బ్స్ 2024 భారత కుబేరుల జాబితా టాప్ 10: టాప్ 1లో ఎవరంటే
ప్రతి సంవత్సరం ఫోర్బ్స్, బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే . అయితే ప్రపంచంలోనే అపర కుబేరులు మాత్రమే కాకుండా 2024 రిచెస్ట్ ఇండియన్స్ జాబితాను కూడా ప్రతి సంవత్సరం వెల్లడి చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఫోర్బ్స్ 2024 రిచ్చెస్ట్ ఇండియన్స్ జాబితాను వెల్లడించింది. ఇందులో టాప్ 100 రిచెస్ట్ ఇండియన్స్ లిస్ట్ ప్రకారం వారి సంపదను అంచనా వేసింది.
భారతదేశ అత్యంత సంపన్నుల జాబితా
భారతదేశంలో 100 మంది అత్యంత ధనవంతుల మొత్తం సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసిందని ఫోర్బ్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది .భారత దేశంలో అపర కుబేరుల సంపద 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఇక భారతదేశంలోని అపర కుబేరుల జాబితా విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 119.5 బిలియన్ డాలర్లతో టాప్ వన్ స్థానంలో నిలిచారు.

టాప్ 1, 2 స్థానాల్లో అంబానీ, ఆదానీలు
అంబానీ సంపద భారత కరెన్సీలో 10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఇక అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ లిస్టులో రెండవ స్థానంలో నిలిచారు. అదానీ సంపద 116 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదించింది గౌతమ్ అదాని కావడం విశేషం. ఒక సంవత్సరంలో గౌతమ్ అదానీ సంపద 48 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది సుమారు 9.75 లక్షల కోట్లకు సమానంగా చెబుతారు.
భారత సంపన్నుల్లో మూడో స్థానంలో మహిళ, 4, 5 స్థానాల్లో వీరే
ఇక భారతదేశంలో సావిత్రి జిందాల్ కుటుంబం 43.7 బిలియన్ డాలర్ల తో మూడవ స్థానంలో నిలిచింది. భారతీయ ధనవంతుల జాబితాలో ఒక్కరే ఒక మహిళ సావిత్రి జిందాల్ కావడం విశేషం. ఈమె టాప్ టెన్ లో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక భారతీయ సంపన్నులలో శివ నాడార్ 40.2 బిలియన్ల డాలర్లతో నాలుగవ స్థానాన్ని, దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ ఐదవ స్థానంలో ఉంది. వీరి సంపద మొత్తం 32.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఆరు నుండి 9 స్థానాల్లో వీరే
ఆరవ స్థానంలో రామ్ కిషన్ దమాని మరియు వారి కుటుంబం 31.5 బిలియన్ డాలర్లతో నిలువగా, ఏడవ స్థానంలో నవీన్ మిట్టల్ కుటుంబం 30.7 బిలియన్ డాలర్లతో నిలిచింది. ఇక ఎనిమిదవ స్థానంలో కుమార్ బిర్లా 24.8 బిలియన్ డాలర్లతో నిలవగా, తొమ్మిదవ స్థానంలో సైరస్ పూనవాల్లా 24.5 బిలియన్ డాలర్లతో నిలిచారు.
పదవ స్థానంలో ఉంది ఎవరంటే
ఇక భారతదేశంలోని అపర కుబేరులలో పదవ స్థానంలో బజాజ్ కుటుంబం 23.4 బిలియన్ డాలర్లతో నిలిచింది. ఇక ఈ సంవత్సరం కూడా తిరుగులేకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ వన్ లో నిలిచి తన స్థానాన్ని మళ్లీ దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications