వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Foreigners: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరుతో నకిలి పాస్ పోర్ట్, త్రీఇడియట్స్ !

|
Google Oneindia TeluguNews

లక్నో: ఆన్ లైన్ పలు రోగాలకు మెడిసన్ ఇస్తున్నామని, కావలసిన వారికి ఆ మందులు విక్రయిస్తున్నామని విదేశీయులు ప్రకటనలు ఇచ్చారు. ఆన్ లైన్ లో మెడిసన్ వివరాలు తెలుసుకున్న వారు ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో నివాసం ఉంటున్న ఆర్మీ రిటైడ్ అధికారి విదేశీయులను సంప్రధిస్తే అక్కడ అసలు కథ మొదలైయ్యింది. ముగ్గురు విదేశీయులు పోలీసులకు చిక్కారు. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరుతో నకిలి పాస్ పోర్టు తయారు చేసిన విషయం, దొంగ నోట్ల వ్యవహారంతో పాటు చాలా విషయాలు బయటకు వచ్చాయి.

Lady; ఆంధ్రా మొగుడు, బెంగళూరు ప్రియుడు, ఒకే ఇంట్లో ఎంజాయ్ చేశారు, సీన్ కట్ చేస్తే ? కంత్రీ!Lady; ఆంధ్రా మొగుడు, బెంగళూరు ప్రియుడు, ఒకే ఇంట్లో ఎంజాయ్ చేశారు, సీన్ కట్ చేస్తే ? కంత్రీ!

 ఆర్మీ రిటైడ్ అధికారి

ఆర్మీ రిటైడ్ అధికారి

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఆర్మీ రిటైడ్ అధికారి నివాసం ఉంటున్నారు. ఆర్మీ రిటైడ్ అధికారి ఫ్యామిలీలో ఒకరు క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు, నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సంప్రధించారు. సహజ సిద్దంగా తయారు చేసిన మందులు వాడితో క్యాన్సర్ తగ్గిపోతుందని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని నైజీరియాకు చెందిన వ్యక్తులు ఆర్మీ రిటైడ్ అధికారికి మాయమాటలు చెప్పారు.

 ముంచేసిన విదేశీయులు

ముంచేసిన విదేశీయులు

తరువాత ఆర్మీ రిటైడ్ అధికారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. కొంతకాలం తరువాత మోసపోయామని తెలుసుకున్న ఆర్మీ రిటైడ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా క్యాన్సర్ వ్యాధి నయం కావడానికి మాకు మెడిసన్ కావాలని విదేశీయులను సంప్రధించారు. టచ్ లోకి వచ్చింది పోలీసులు అని విదేశీయులు గుర్తించలేకపోయారు.

 ఐశ్వర్యరాయ్ పేరుతో నకిలి పాస్ పోర్ట్

ఐశ్వర్యరాయ్ పేరుతో నకిలి పాస్ పోర్ట్

పక్కాస్కెచ్ వేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆన్ లైన్ మోసాలకు పాల్పుడుతున్న ఇద్దరు నైజీరియన్లు, ఘనా దేశానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు షాకింగ్ సమాచారం ఇచ్చారు. ముగ్గురు విదేశీయులు నకిలి పాస్ పోర్టులు తయారు చేసి విక్రయిస్తున్నారని, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరుతో కూడా నకిలి పాస్ పోర్ట్ తయారు చేశామని నిందితులు అంగీకరించారని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

 త్రీ ఇడియట్స్ స్టోరీ మొత్తం ?

త్రీ ఇడియట్స్ స్టోరీ మొత్తం ?

నిందితుల నుంచి రూ. 13 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు, ప్రింటర్లు, విదేశీ కరెన్సీతో పాటు రూ. 10. 76 కోట్ల విలువైన నకిలి నోట్లు స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. నిందితులు ఎంతమందికి నకిలి పాస్ పోర్టులు ఇచ్చారు అని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Foreigners made a fake passport in the name of Bollywood actress Aishwarya Rai in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X