• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజినీకాంత్‌తో శశికళ భేటీ: ఇంటికెళ్లి మరీ సుదీర్ఘ చర్చలు: తమిళ రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్లు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయా?..అధికార డీఎంకే, ప్రతిపక్ష ఎఐఎడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన పార్టీ ఆవిర్భవిస్తుందా? దీనికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆద్యురాలు అవుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడిప్పుడే తలెత్తుతున్నాయి. నాలుగు సంవత్సరాల కారాగారవాసం నుంచి బయటికి వచ్చిన వీకే శశికళ చాపకింద నీరులా కొత్త పార్టీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టే కనిపిస్తోందనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఊపందుకుంటోంది.

రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా..

రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా..

రాజకీయాల నుంచి తాను తప్పుకొంటున్నట్లు వీకే శశికళ ఇదివరకే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె చేసిన ఈ ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ పార్టీలోనూ చేరబోవట్లేదనీ చెప్పారు. అన్నా డీఎంకే మరోసారి అధికారంలోకి రావాలన్నది తన బలమైన కాంక్షగా చెప్పుకొచ్చారు. జయలలిత అందించిన సుపరిపాలన మళ్లీ తమిళనాడు ప్రజలకు అందాలని కోరుకుంటున్నానని, ఇంతకంటే తాను ఇంకేమీ చేయలేననీ అన్నారు. ఆమె కోరిక నెరవేరలేదు.

 మనసు మారిందా..?

మనసు మారిందా..?

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ శశికళ తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. అన్నా డీఎంకే అధికారంలోకి రాకపోవడం, క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో తాను రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో సాగుతోంది. అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీని స్థాపించడమా? లేక టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నెట్ర కజగం పార్టీని బలోపేతం చేయడమా? అనే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

 రజినీకాంత్‌తో భేటీ..

రజినీకాంత్‌తో భేటీ..

ప్రత్యామ్నాయంగా ఎదగాలనే లక్ష్యంతో ఆమె పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాల మధ్య వీకే శశికళ.. కొద్దిసేపటి కిందటే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలుసుకున్నారు. చెన్నై పోయెస్ గార్డెన్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. రజినీకాంత్, ఆయన భార్య లతను కలుసుకున్నారు. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో నాలుగు సంవత్సరాల పాటు శిక్షను అనుభవించి, బయటికి వచ్చిన తరువాత వీకే శశికళ.. రజినీకాంత్‌ను కలుసుకోవడం ఇదే తొలిసారి.

 రాజకీయాలపై..

రాజకీయాలపై..

రాష్ట్ర రాజకీయాలు, రజినీకాంత్ పార్టీ గురించి ఈ సందర్భంగా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రజినీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడిగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అదే బీజేపీతో ఏఐఎడీఎంకే పొత్తు పెట్టుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఓడిపోయింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలను ఆకట్టుకునేలా ఆయన పరిపాలన సాగిస్తున్నారనే పేరును సంపాదించుకుంది.

రీ ఎంట్రీ కోసం..

రీ ఎంట్రీ కోసం..

మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల సారథ్యంలో ఏఐఎడీఎంకే క్రమంగా బలహీనపడుతోందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- శశికళ.. రజినీకాంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడవచ్చని, డీఎంకే ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో- కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న రజినీకాంత్‌ను శశికళ కలుసుకోవడం చర్చనీయాంశమౌతోంది. తమిళనాడు రాజకీయాల్లో కొన్ని కీలకమైన, అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చని, అది.. రజినీకాంత్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.

English summary
Former AIADMK leader VK Sasikala met with actor Rajinikanth and his wife Latha at his residence in Chennai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X