గ్యాంగ్‌రేప్: 6గురు నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే కొడుకు

Former BJP MLA's son, five others arrested for gang-raping teenager
బార్వా: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోస్ జిల్లా పిపల్‌జోపా అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దళ్‌సింగ్ సోలంకీ కుమారుడు నానుగోడా అలియాస్ సంతోష్ తోపాటు ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల్లో ఒకడైన ఎక్కా నాన్ల పటేల్ అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడున్న ఐదుగురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధిరాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన ఆగస్టు 14న జరిగింది. బాధిత యువతిని ఎక్కా నాన్ల పటేల్ ఎత్తుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతిపై ఏడు రోజులపాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు.

ఘటనా స్థలం నుంచి ఎలాగోలా తన ఇంటికి చేరుకుంది బాధిత యువతి. ఆ తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో బాధిత యువతితోపాటు కుటుంబసభ్యులు గురువారం రాత్రి భగ్వాన్‌పురా పోలీసులను ఆశ్రయించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+