వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్.. ప్రియాంక సన్నిహితురాలి గుడ్ బై.. సొంత పార్టీ ప్రయత్నాల్లో దళిత లీడర్

|
Google Oneindia TeluguNews

దళితులకు దగ్గరకావడం ద్వారా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మళ్లీ పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో ఎంపీగా ఉంటూనే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సావిత్రిబాయి పూలే.. ఇప్పుడు అంతే సంచలన రీతిలో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన కొద్దికాలంలోనే ఆ పార్టీ ఈస్ట్ యూపీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీకి సావిత్రి చాలా దగ్గరయ్యారు. లోక్ సభ ఎన్నికల టైమ్ లో ప్రియాంక బోటు యాత్ర, పాదయాత్రల్లో కీలకంగా వ్యవహరింరు.

అందుకే రాజీనామా..
చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ తన వాయిస్ కు సరైన గుర్తింపు రావట్లేదని, ఈవీఎంలపై పోరాటం సహా ఏ అంశాన్ని లేవనెత్తినా హైకమాండ్ పట్టించుకోవడంలేదని సావిత్రి భాయి పూలే ఆరోపించారు. ఈ కారణం వల్లే పార్టీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. బుద్ధిజాన్ని నమ్ముతూ కాషాయాన్ని ధరించే సావిత్రి.. 2012లో యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Former BJP MP Savitri Bai Phule quits Congress party

2014లో బెహ్రెయిచ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. బీజేపీలో దళితులకు సరైన ప్రాతినిధ్యం దక్కడంలేదని ఆరోపిస్తూ.. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీని వీడారు. కొన్నాళ్లకు కాంగ్రెస్ గూటికి చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెహ్రెయిచ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

Former BJP MP Savitri Bai Phule quits Congress party

కొత్త పార్టీ పెడతా
దళితుల జనాభా ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్ లో దళితవాదంపై మరో కొత్త పార్టీ పుట్టుకురానుంది. అతి త్వరలోనే సొంతగా పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు మాజీ ఎంపీ సావిత్రి బాయి పూలే ప్రకటించారు. పార్టీ పేరు, విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆమె చెప్పారు. సావిత్రి రాజీనామాపై కాంగ్రెస్ స్పందించాల్సిఉంది.

English summary
Former BJP MP Savitri Bai Phule quits Congress party Says Will Float Her Own Outfit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X