వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి, ప్రధాని మోడీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాదం తర్వాత, మిస్త్రీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Recommended Video

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఇక లేరు *National | Telugu OneIndia

కారు డ్రైవర్‌తో సహా ఆయన మరణించగా, వారితోపాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు, వారిని గుజరాత్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Former Chairman Of Tata Sons Cyrus Mistry Dies In Road Accident Near Mumbai

"టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళుతుండగా.. అతని కారు డివైడర్‌ను ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కారులో నలుగురు ఉన్నారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు" పాల్ఘర్ పోలీసులు మీడియాకు తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

"మధ్యాహ్నం 3.15 గంటలకు మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. సూర్య నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఇది యాక్సిడెంట్‌గా అనిపిస్తోంది' అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

2012లో రతన్ టాటా రాజీనామా చేసిన తర్వాత సైరస్ మిస్త్రీకి టాటా సన్స్ చైర్మన్ పదవి లభించింది. అయితే, 4 సంవత్సరాల తర్వాత ఆయన ఈ పదవి నుంచి తొలగించబడ్డారు.

ఎవరీ సైరస్ మిస్త్రీ?

సైరస్ పల్లోంజీ మిస్త్రీ (జననం 4 జూలై 1968) ఒక వ్యాపారవేత్త, అతను 28 డిసెంబర్ 2012న టాటా గ్రూప్‌కు ఛైర్మన్ అయ్యారు. ఆ తర్వాత టాటా గ్రూప్ మిస్త్రీని 24 అక్టోబర్ 2016న ఆ పదవి నుంచి తొలగించింది. అతను గ్రూప్ ఆరవ ఛైర్మన్. ఆయన భారతదేశం, బ్రిటన్ రెండింటిలోనూ "అత్యంత ముఖ్యమైన పారిశ్రామికవేత్త" అని ది ఎకనామిస్ట్ వర్ణించింది. ఇయన భారత నిర్మాణ దిగ్గజం పల్లోంజీ మిస్త్రీకి చిన్న కుమారుడు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

సైరస్ మిస్త్రీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిస్త్రీ మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. "సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.' అని మిస్త్రీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని సహా రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Former Chairman Of Tata Sons Cyrus Mistry Dies In Road Accident Near Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X