డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమార్తె.. వీడియో వైరల్!
ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చోబెట్టి చెప్పుతో కొడుతున్న సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. అయితే ఆ మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె. ఆ మోకాళ్లపై కూర్చున్న వ్యక్తి ఒక డ్రైవర్. ఇంతకీ ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది.. ఆ డ్రైవర్ ఏం చేశాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె.. ఓ వ్యక్తిని మోకాళ్లపై కూర్చొబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తోంది. ఈ ఘటన దీస్ పూర్‌లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఆమెను వివరణ కోరగా.. సదరు వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు మహంత కుమార్తె తెలిపారు. అయితే నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు.

ఈ విషయమై పలుమార్లు అతడిని హెచ్చరించినప్పటికీ, అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదన్నారు. సోమవారం కూడా అతడు పూటుగా మద్యం సేవించి వచ్చి, తన ఇంటి తలుపులు కొట్టాడని మహంత కూతురు చెప్పారు. అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లు చెప్పారు. ఇక సదరు డ్రైవర్‌పై ఇన్నాళ్లూ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Shocking visuals emerge allegedly, showing former #Assam CM @PrafullaKumarMahanta’s daughter allegedly assaulting a staff member with a chappal. Such behavior is unacceptable and must be condemned. Authorities should take swift action! #Assam #viralvideo pic.twitter.com/P2kg75Va7i
— Afrida Hussain (@afridahussai) March 3, 2025
అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో నివాసం ఉండడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలానే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగినా లేదా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications