బ్యాంక్ జాబ్స్‌పై ఆశలు పెట్టుకున్నవారికి పెద్ద దెబ్బే: ఫ్యూచర్‌లో పరిస్థితి ఇలా!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆటోమేషన్ ప్రభావంతో ఇప్పటికే ఐటీ ఉద్యోగులు రోడ్డున పడుతున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో ఈ ఎఫెక్ట్ బ్యాంకింగ్ సెక్టారుపై కూడా పడే అవకాశం ఉంది. ఆటోమేషన్ కారణంగా రానున్న ఐదేళ్లలో బ్యాంకింగ్ రంగంలో 30శాతం ఉద్యోగాలు కూడా కనుమరుగవుతాయని సిటీ గ్రూప్‌ మాజీ సీఈవో విక్రమ్‌ పండిట్‌ వెల్లడించడం గమనార్హం.

కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌ రాకతో బ్యాంకులు తమ సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు.విక్రమ్ పండిట్ అభిప్రాయంతో బ్యాంకింగ్ నిపుణులు ఏకీభవిస్తున్నారు. కాగా, కృత్రిమ మేధస్సుతో బ్యాకింగ్‌ రంగ మౌలిక స్వరూపమే మారిపోనుందని స్విట్జర్లాండ్ బ్యాంకు యూబీఎస్ సీవోవో లెహమన్ తెలిపారు.

 FORMER CITI CEO: 30% of banking jobs will be wiped out in 5 years

కింది స్థాయి ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆటోమేషన్ రాకతో డేటా ఎంట్రీ వంటి దిగువస్థాయి ఉద్యోగాలు లేకుండా పోతాయని లెహమన్ అన్నారు. అలాగే కొత్త కొత్త ఉద్యోగాల వృద్ధి శాతం కూడా చాలా వరకు తగ్గిపోతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు సీనియర్ భాగస్వామి సౌరభ్ త్రిపాఠి తెలియజేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vikram Pandit, former CEO of Citigroup , says 30% of banking jobs could disappear within the next five years.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి