మోదీకి, హైకమాండ్ కు సంబంధం లేదు, మావల్లే ఇలా జరిగింది, బసవరాజ్ బోమ్మయ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీఎం ఎవరు అని వర్గపోరు మొదలైయ్యింది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ సీఎం సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇంటికే పరిమితం కాలేదు.
బెంగళూరులో సీఎల్ పీ సమావేశం జరుగుతున్న రోజే బీజేపీ నాయకులు బెంగళూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఈ సమావేశానికి హాజరైనారు.

దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందని, ఒక్క కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నదని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాట్లాడారు.
కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ సా, జేపీ నడ్డా కారణం కాదని, కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి తనతో పాటు కర్ణాటకలోని నాయకులే కారణం అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడానికి, బీజేపీ హైకమాండ్ కు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
మొత్తం మీద బెంగళూరులో సీఎల్ పీ సమావేశం జరుగుతున్న రోజే బెంగళూరులో బీజేపీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు వారి కష్టాలను బీజేపీ నాయకులకు చెప్పారని తెలిసింది. అయితే బీజేపీ ఎదో ప్లాన్ వేస్తోందని రాజకీయా నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications