వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ మాజీ ముఖ్యమంత్రి చేతబడులను ప్రోత్సహిస్తారు: హీరో చేతన్ ఫైర్ !

మాజీ ముఖ్యమంత్రి చేతబడులను ప్రోత్సహిస్తారు మఠాలకు రూ. 300 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప మీద నటుడు చేతన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప విభజించు, పాలించు అనే రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు లింగాయత్ కులస్తులు తగినబుద్ది చెబుతారని కన్నడ నటుడు చేతన్ మండిపడ్డారు. లింగాయత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలని చేతన్ అన్నారు.

బెంగళూరులోని బసవ సమితి ప్రాంగణంలో జన సామాన్య వేధిక ఏర్పాటు చేసిన లింగాయత్ కులస్తులకు ప్రత్యేక ధర్మం కావాలి అనే కార్యక్రమంలో పాల్గోన్న కన్నడ నటుడు చేతన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కర్ణాటక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Former CM BS Yeddurappa playing divisive politics: Kannad actor Chetan

హిందూ, ముస్లీం, క్రిష్టియన్ లకు ధర్మాలు ఎలా ఉన్నాయో లింగాయత్ లకు అలాగే ప్రత్యేక ధర్మం అవసరం అని చేతన్ అన్నారు. జైన్, బౌద్ద, సిక్ లకు ప్రత్యేక ధర్మాలు ఉన్నాయని, అలాగే లింగాయత్ లకు ప్రత్యేక ధర్మం కావాలని నటుడు చేతన్ డిమాండ్ చేశారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప చేతబడులను ప్రోత్సహించారని, వివిధ మఠాలకు రూ. 300 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారని చేతన్ ఆరోపించారు. లింగాయత్ కులస్తులను విభజించి రాజకీయాలు చెయ్యాలని యడ్యూరప్ప ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బసవన్న తత్వాలు కాపాడటానికి లింగాయత్ లకు ప్రత్యేక ధర్మం అవసరం అని కర్ణాటకలోని వివిధ మఠాధిపతులు ఇదే సందర్బంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Kannada actor Chetan alleged that the community could not reach a consensus on the issue because of the politics played by the former CM BS Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X