మోదీ, అమిత్ షా రాజకీయం, మరోసారి కింగ్ మేకర్, దెబ్బ ఇలా పడిందని లేటుగా తెలిసింది !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ ఓడిపోయింది. కమలనాథుల శిబిరం ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ఈ ఓటమి కర్ణాటకకే పరిమితం కాలేదు. ఎందుకంటే బీజేపీ ఓటమి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాష్ట్రాల్లో కూడా కర్ణాటకలో బీజేపీని దెబ్బ కొట్టినట్లు కొట్టాలని కాంగ్రెస్, విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ కారణంగానే కేంద్రంలోని బీజేపీ నేతలు అప్రమత్తమైనారు.

కర్ణాటకలో బీజేపీ మళ్లీ పుంజుకోవాలంటే ఒక్కటే మార్గం అని తెలుసుకున్న ఆ పార్టీ హైకమాండ్ కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు పరోక్షంగా అధికారం కట్టబెట్టడానికి సిద్దం అయ్యింది. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కర్ణాటకలో ఉన్న పవర్ బీజేపీ హైకమాండ్ కు తెలుసు. గతంలో బీఎస్ యడియూరప్ప బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత 2013లో కర్ణాటకలో మొదటిసారి బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Former CM BS Yeddyurappa is once again becoming the kingmaker in Karnataka BJP.

ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాడం, యడియూరప్పను బుజ్జగించడంతో ఆయన మళ్లీ బీజేపీలోకి వచ్చారు. యడియూరప్ప చేరికతో కమలనాథులకు బలం చేకూరింది. 2013లో బీజేపీ హైకమాండ్ యడ్యూరప్పను ఇబ్బంది పెట్టడంతో లింగాయత్ ఓట్లు పడకపోవడంతో బీజేపీ విలవిలలాడిపోయింది. 2023లో కూడా లింగాయత్‌ల ఆగ్రహానికి బీజేపీ బలి అయ్యింది.

అందుకే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. మాజీ సీఎం యడ్యూరప్ప కొడుకు బీవై. విజయేంద్రను కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడిగా చెయ్యాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందని వెలుగు చూసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే వరుసగా రెండుసార్లు విజయం సాధించినా ఈసారి లోక్ సభ ఎన్నికలు అంత సులువు కాదని బీజేపీ నాయకులు గుర్తించారు.

అలాగే కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం, పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి దెబ్బ పడటంతో బీజేపీ హైకమాండ్ ఆందోళన చెందుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రతిపక్షాలు పుంజుకుంటాయని, కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రానికి తగిన నాయకుడు కావాలని బీజేపీ హైకమాండ్ గుర్తించింది. ముఖ్యంగా లింగాయత్ లు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి లింగాయత్ నాయకులు అవసరం. మరోసారి మాజీ సీఎం యడ్యూరప్పను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బీజేపీ ప్లాన్ ఏంటి అని ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఎస్ యడ్యూరప్పకు కర్ణాటక బీజేపీ బాధ్యతలు అప్పగించారని తెలిసింది. అయితే యడ్యూరప్పను నేరుగా ఎన్నికల రంగంలోకి దింపలేరు. ఆ విధంగా యడ్యూరప్ప కుమారుడు బీవై. విజ‌యేంద్ర‌ని తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న వార్త ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Former CM BS Yeddyurappa is once again becoming the kingmaker in Karnataka BJP.

ముఖ్యంగా శోభా కరంద్లాజే కర్ణాటక బీజేపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఇష్టపడటం లేదన్న చర్చ జరుగుతున్నన సమయంలో బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరు తెరమీదకు వచ్చింది. బీజేపీ కర్ణాటక అధ్యక్షుడిగా విజయేంద్రే వస్తే మరో సమస్య వస్తుందనే భయం బీజేపీ నాయకుల్లో ఉంది. అయితే బీజేపీ హైకమాండ్ అంతిమ నిర్ణయం తీసుకుంటుంది.

బీఎల్ సంతోష్, మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్పల మధ్య వైరం ఉందని అందరికి తెలిసిందే. సీఎం పదవి నుంచి యడ్యూరప్ప తప్పించడానికి ప్రధాన కారణ: బీఎల్. సంతోష్ అని అప్ప వర్గం ఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో యడ్యూరప్ప తనయుడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడైతే బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక బీజేపీలో మరోసారి యడియూరప్ప కింగ్ అని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+